English | Telugu
బాలయ్య "అధినాయకుడు" జూన్ 1 న విడుదల
Updated : May 24, 2012
బాలయ్య "అధినాయకుడు" జూన్ 1 న విడుదల కానుందని విభిన్నవర్గాల ద్వారా అందిన సమాచారం. కర్ణుడి చావుకి ఆరు కారణాలన్నట్లు ఎప్పుడో విడుదల కావలసిన "అధినాయకుడు" జూన్ 1 వ తేదీన విడుదల కాబోతూందని సినీ వర్గాలంటున్నాయి. శ్రీ కీర్తి క్రియేషన్స్ పతాకంపై, యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా, జయసుధ, లక్ష్మీరాయ్, సలోని, చార్మి ప్రథాన పాత్రల్లో నటిస్తూండగా, పరుచూరి మురళి దర్శకత్వంలో, యమ్.యల్.కుమార్ చౌదరి నిర్మించిన చిత్రం "అధినాయకుడు". ఈ చిత్రానికి కళ్యాణి మాలిక్ సంగీతాన్నందించారు. ఆ మధ్య విడుదలైన ఈ "అధినాయకుడు" చిత్రం ఆడియోకి ప్రేక్షకుల నుండి చక్కని స్పందన లభిస్తూంది.'