English | Telugu
కర్నూల్లో "రచ్చ" 50 రోజుల వేడుక
Updated : May 24, 2012
కర్నూల్లో "రచ్చ" 50 రోజుల వేడుక జరుగనుందట. మెగా సూపర్ గుడ్ పతాకంపై, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా, సంపత్ నంది దర్శకత్వంలో, యన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ నిర్మించిన చిత్రం"రచ్చ". ఈ "రచ్చ" చిత్రం ఆడియో విడుదలను కర్నూల్లో జరుపుతారని వినపడింది. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఆ వేడుకను హైదరాబాద్ లోనే నిర్వహించటం జరిగింది.
ఈ రోజుతో అంటే 24-5-2012 కి "రచ్చ" చిత్రం విడుదలై 50 రోజులయ్యింది. 127 సెంటర్లలో "రచ్చ"చిత్రం 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ఆడియో విడుదల సభలో దర్శకుడు సంపత్ నంది చెప్పిన మాట ప్రకారం ఈ అర్థశతదినోత్సవ వేడుకను కర్నూల్ లో జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారట.