English | Telugu
హిందువులని విడగొట్టడానికే ప్రభాస్ సినిమా
Updated : Nov 8, 2023
ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన నచ్చావులే అనే సినిమాతో మాధవిలత హీరోయిన్ గా తెలుగు సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా చేసినా కూడా ఆశించినంతగా సక్సెస్ మాత్రం అవ్వలేక పోయింది. ఆ తర్వాత రాజకీయాల్లో బిజీగా గడిపిన మాధవిలత కొన్నాళ్ల నుంచి వాటికి కూడా దూరంగా ఉంటూ వస్తుంది. తాజాగా ప్రభాస్ నటించిన ఒక సినిమా మీద ఘాటు వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టిస్తుంది.
కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉంటూ వస్తున్న మాధవిలత ఇప్పుడు ఒక్కసారిగా తనదైన స్టైల్లో సంచలనాలని నమోదుచేస్తుంది. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూ లో యాంకర్, మాధవిలత దగ్గర ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమా గురించి ప్రస్తావనకి తీసుకొచ్చాడు. అప్పుడు మాధవీలత అది పురుష్ సినిమా ఒక పెద్ద బ్లండర్ మూవీ అని అంతే కాకుండా డిజాస్టర్ అండ్ డర్టియస్ట్ మూవీ అని ఒక లెవెల్లో రిప్లై ఇచ్చింది. అంతే కాకుండా ఆదిపురుష్ మూవీ హిందువులని విడదీయడానికే తెరకెక్కించారు అనే ఒక సంచలన ఆరోపణని కూడా మాధవిలత చేసింది.
అలాగే సినిమా రంగం మీద కూడా మాధవిలత కొన్ని కీలక వ్యాఖ్యలని చేసింది. సినిమా అనేది చాలా పెద్ద మాధ్యమం. ఎలాంటి విషయాన్ని అయినా చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలదు. కృష్ణుడ్ని గోపికలచుట్టూ తిరిగే ఒక బాడ్ క్యారెక్టర్ గా చిత్రీకరించడంతో పాటు మన రామాయణం, మహాభారతాన్ని తప్పుగా చూపించింది సినిమాలే. ప్రజలందరూ సినిమాలో చూపించేది నిజమని నమ్ముతున్నారు. నేను కూడా మొన్నటి వరకు వాటినే నిజమనుకున్నాను. కానీ ఈ మధ్యనే అసలు నిజం తెలుసుకున్నాను అని మాధవీలత చెప్పింది.