English | Telugu

తన అభిమానులకి తీపి కబురు చెప్పిన సీనియర్ నరేష్ 

ప్రముఖ దివంగత నటి ,దర్శకురాలు విజయనిర్మల నటవారసుడుగా తెలుగు చిత్ర రంగ చేసి ఎన్నో సినిమాల్లో అద్భుతంగా నటించి అశేష సినీ ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన నటుడు నరేష్. రీసెంట్ గా కూడా సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. తన నటనతో సినిమాకి ఒక రేంజ్ వచ్చేలా చెయ్యడం నరేష్ స్టైల్. తాజాగా ఆయన ఒక తియ్యని వార్తని తన అభిమానులతో పంచుకున్నాడు.

2016 వ సంవత్సరంలో నందిని నర్సింగ్ హోమ్ సినిమాతో హీరోగా పరిచయం అయిన నరేష్ కొడుకు నవీన్ విజయకృష్ణ ఇప్పుడు ప్రతిష్టాత్మక ఓనిరోస్ ఫిల్మ్ అవార్డ్ ని దక్కించుకున్నాడు. తన చిన్ననాటి స్నేహితుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా కలర్స్ స్వాతి హీరోయిన్ గా నవీన్ తన దర్శకత్వంలో సత్య అనే మ్యూజికల్ ఫ్యూచర్ షార్ట్ ఫిలింని చిత్రీకరించాడు. ఈ సినిమాని న్యూయార్క్ లో జరిగిన ఓనిరోస్ ఫిల్మ్ అవార్డ్ ఫంక్షన్ లో ప్రదర్శించారు. సినిమా చూసిన అవార్డు కమిటీ ఉత్తమ పరిచయ దర్శకుడి కోటాలో నవీన్ కి అవార్డు ని ప్రకటించింది. ఈ విషయాన్ని నరేష్ ట్విట్టర్ వేదికగా తన అభిమానులకి వెల్లడి చేసాడు. అలాగే మా కుటుంబంలోని నాలుగో తరం నుంచి ఇప్పుడు దర్శకుడుగా మీ ముందుకు వస్తున్న నా కుమారుడికి మీ అందరి శుభాకాంక్షలు, ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా అని నరేష్ ట్విటర్ వేదికగా తన అభిమానులని ,ప్రేక్షకులని కోరాడు.

సత్య మ్యూజిక్ షార్ట్ ఫిలిం ని దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హన్షితా రెడ్డి, హర్షిత్ రెడ్డి నిర్మించారు. ఆల్రెడీ ఈ షార్ట్ ఫిల్మ్ నుంచి సోల్ ఆఫ్ సత్య పేరుతో ఒక పాట కూడా విడుదలైంది. 6 నిమిషాల నిడివి ఉన్న ఆ పాటలో సత్య షార్ట్ ఫిల్మ్‌ లో ఉన్న సోల్ ఏంటో చెప్పారు. దేశం కోసం పోరాడే సైనికులను సరిహద్దులకు పంపిస్తూ వాళ్ల ఇళ్లలో మహిళలు చేస్తున్న త్యాగాన్ని కొనియాడుతూ ఈ పాట రూపుదిద్దుకుంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .