English | Telugu

బ్రేక్ ఈవెన్ కష్టమే.. ఫ్లాప్ దిశగా 'అమిగోస్'!

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం 'అమిగోస్'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి రాజేంద్ర రెడ్డి దర్శకుడు. ఫిబ్రవరి 10న విడుదలైన ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. దీంతో మొదటి వీకెండ్ ముగిసే సరికి బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో 50 శాతం కూడా రికవర్ చేయలేకపోయింది.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.2.58 కోట్ల షేర్ రాబట్టిన 'అమిగోస్'.. రెండో రోజు రూ.1.34 కోట్ల షేర్, మూడో రోజు రూ.1.33 కోట్ల షేర్ రాబట్టింది. మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.5.25 కోట్ల షేర్ వసూలు చేసింది. 'అమిగోస్' ఓవరాల్ బిజినెస్ వాల్యూ 11.30 కోట్లు కాగా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా 6.50 కోట్లకు పైగా షేర్ రాబట్టాల్సి ఉంది.

తెలుగు రాష్ట్రాల బిజినెస్ వాల్యూ 9.10 కోట్లు కాగా.. మూడు రోజుల్లో రూ.4.35 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఏరియాల వారీగా చూస్తే నైజాంలో రూ.1.28 కోట్ల షేర్(రూ.3.8 కోట్లు), సీడెడ్ లో 80 లక్షల షేర్(రూ.1.1 కోట్లు), ఆంధ్రాలో 2.27 కోట్ల షేర్(రూ.4.2 కోట్లు) సాధించింది. సీడెడ్ లో బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశముంది కానీ నైజాం, ఆంధ్రాలో అనుమానమే. ఓవరాల్ బ్రేక్ ఈవెన్ కూడా కష్టమే. ఏదైనా అద్భుతం జరిగే తప్ప ఈ చిత్రం ఫ్లాప్ నుంచి తప్పించుకునే అవకాశాలు లేవని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.