English | Telugu
లోకేష్ సినిమాలో జరుగుతున్న మోసాన్ని బయటపెట్టిన బ్రహ్మాజీ!
Updated : Oct 5, 2023
సినిమాల్లో నటించాలని.. డబ్బు, పేరు సంపాదించుకోవాలని ఎంతో మంది కలలు కంటూ ఉంటారు. దానికోసం విశ్వప్రయత్నం చేస్తుంటారు. వారి బలహీనతను అదునుగా తీసుకొని కొందరు మోసగాళ్ళు సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాంటి ఓ స్కామ్‌ను నటుడు బ్రహ్మాజీ బయటపెట్టాడు. అలాంటి వారి విషయంలో చాలా జాగ్రత్తగా వుండాలని ట్వీట్ చేశారు.
అసలు విషయం ఏమిటంటే.. తాము స్టార్ డైరెక్టర్ల దగ్గర పనిచేస్తున్నామని యువ నటులకు మెసేజ్‌లు పంపిస్తున్నారు. పెద్ద సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామంటూ డబ్బు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఈ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు బ్రహ్మాజీ.
బ్రహ్మాజీ వేసిన ట్వీట్ సారాంశమిది... ‘నటరాజ్ అన్నాదొరై అనే వ్యక్తి.. దర్శకుడు లోకేశ్ కనగరాజ్ మేనేజర్‌ని అంటూ పరిచయం చేసుకొని నటనపై ఆసక్తి ఉన్న యువతీ యువకులకు మెసేజ్‌లు పెడుతూ ఫోన్ కాల్స్ చేస్తున్నారు. లోకేష్ కనకరాజ్ లేటెస్ట్ మూవీకి మీ ప్రొఫైల్ ఎంపికైందని నమ్మబలుకుతున్నారు. ఆడిషన్‌కి రావాలంటే తనకు కొంత డబ్బు పంపాలని, వాటితో అవసరమైన కాస్ట్యూమ్స్ రెంట్‌కి తీసుకొస్తానని, ఆడిషన్ పూర్తయిన వెంటనే డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని చెబుతున్నాడు. ఇతనితోపాటు సత్యదేవ్ అనే మరో వ్యక్తి తాను ఫోర్బ్స్ మ్యాగజైన్ జర్నలిస్టునని నమ్మించి డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇలాంటి వారి మాయలో పడి మోసపోవద్దు అని మనవి చేస్తున్నాను’ అంటూ ట్వీట్ వేసారు. దానితోపాటు నటరాజ్ ఫోన్ నంబర్ కూడా మెన్షన్ చేశాడు బ్రహ్మాజీ.