English | Telugu

కథ అడ్డం తిరిగింది.. ఇప్పుడు దిల్ రాజు ఏం చేస్తాడు?

ప్రముఖ నిర్మాత దిల్ రాజుని మాస్టర్ మైండ్ అని, లక్కీ హ్యాండ్ అని అంటుంటారు. తాను నిర్మించిన, రైట్స్ తీసుకున్న సినిమాలను సరైన సమయంలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తారు. అంతేకాదు ఆ సమయంలో ఇతర పెద్ద సినిమాలు విడుదల కాకుండా తెరవెనక ప్రణాళికలు రచిస్తారు. నైజాం, వైజాగ్ వంటి ఏరియాల్లో థియేటర్లు కూడా ఉండటంతో దిల్ రాజు ఆటలు సాగుతుంటాయి. అయితే ఈ మధ్య ఈ మాస్టర్ మైండ్ కి అంతగా లక్ కలిసి రావడం లేదు. తానొకటి తలిస్తే దైవం మరోటి తలిచింది అన్నట్టుగా.. ఆయనొక ప్లాన్ వేస్తే మిగతా మేకర్స్ మరో ప్లాన్ తో వచ్చి షాక్ ఇస్తున్నారు.

2024 సంక్రాంతి పోరు రసవత్తరంగా ఉండనుంది. ఈ పండగ సీజన్ పై ఇప్పటికే పలు సినిమాలు కర్చీఫ్ వేశాయి. అందులో మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న 'గుంటూరు కారం' ప్రధానమైనది. ఈ మూవీ నైజాం రైట్స్ ని దిల్ రాజు ఏకంగా రూ.45 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. ఒక రీజినల్ ఫిల్మ్ కి ఈ స్థాయి బిజినెస్ అంటే చాలా పెద్ద విషయమే. ఈ మొత్తం రాబట్టాలంటే సినిమాని అత్యంత భారీ సంఖ్యలో థియేటర్లలో విడుదల చేయాల్సి ఉంటుంది. అప్పుడే భారీ ఓపెనింగ్స్ తో బ్రేక్ ఈవెన్ టార్గెట్ చాలావరకు కవర్ అయ్యే అవకాశముంది. అయితే ఇదే సంక్రాంతికి దిల్ రాజు నిర్మిస్తున్న మరో సినిమా కూడా విడుదల కానుంది. విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ డైరెక్షన్ లో రూపొందుతోన్న 'ఫ్యామిలీ స్టార్' మూవీ సంక్రాంతిపైనే కర్చీఫ్ వేసింది. కానీ ఈ సినిమా సంక్రాంతికి రావడం డౌటే అని ఇండస్ట్రీ వర్గాల మాట. ఎందుకంటే ఆ సినిమా ఇటీవలే మొదలైంది. సగం షూటింగ్ అయిపోయింది అంటున్నారు కానీ.. ఈ మూడు నెలల్లో మొత్తం సినిమా పూర్తి కావడం అనుమానమే. ఆ సినిమాని సంక్రాంతి రేసులో ఉంచి, చివరి నిమిషంలో వాయిదా వేస్తే.. గుంటూరు కారంకి నైజాంలో కావాల్సినన్ని థియేటర్లు ఉంటాయని దిల్ రాజు ప్లాన్ అట. ఒకవేళ విజయ్ సినిమా వాయిదా పడకపోయినా.. రెండు సినిమాలు తనవే కాబట్టి నైజాంలో పెద్దగా థియేటర్ల సమస్య రాదని, అలాగే ఆ సమయంలో విడుదల కావాల్సిన ఇతర సినిమాలను ముందుకు వెనక్కో పంపేలా దిల్ రాజు ప్లాన్ చేశాడట. కానీ ఆ ప్లాన్ బెడిసి కొట్టిందని అంటున్నారు.

సంక్రాంతికి 'హనుమాన్', 'ఈగల్', 'నా సామి రంగ', 'సైంధవ్' సినిమాలు కూడా విడుదల కానున్నాయి. అయితే వీటిలో కనీసం రెండు సినిమాలను రేసు నుంచి తప్పించాలని దిల్ రాజు తెర వెనక ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. కానీ ఎవరూ తమ సినిమా విడుదల తేదీని మార్చుకోవడానికి అంగీకరించలేదట. ముఖ్యంగా 'హనుమాన్', 'సైంధవ్' సినిమాలను తప్పించాలని ఆయన అనుకున్నారట. కానీ 'హనుమాన్' టీం ఎప్పుడో రిలీజ్ డేట్ ని ప్రకటించింది. ఎవరొచ్చినా రిలీజ్ డేట్ లో మార్పు లేదని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. ఇక డిసెంబర్ 22న విడుదల కావాల్సిన 'సైంధవ్' ఇప్పటికే 'సలార్' కారణంగా సంక్రాంతికి వచ్చింది. ఇటీవల స్టార్ట్ చేసిన దిల్ రాజు సినిమానే సంక్రాంతిపై కన్నేస్తే.. ఎప్పుడో స్టార్ట్ చేసి, చివరి దశలో ఉన్న తమ సినిమాని ఎలా వాయిదా వేస్తామని 'సైంధవ్' టీం బలంగా ఉంది. సంక్రాంతికే వస్తున్నట్లు తాజాగా స్పష్టం చేసింది. దీంతో దిల్ రాజు కి విజయ్ సినిమాని వాయిదా వేసుకోవడం లేదా గుంటూరు కారం రేటు తగ్గించుకోమని మేకర్స్ ని రిక్వెస్ట్ చేసుకోవడం మించి వేరే ఆప్షన్ లేదంటున్నారు.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.