English | Telugu

ఇదెక్కడి మాస్ రా మావ.. సౌత్ డిజిటల్, శాటిలైట్ రైట్స్ రూ.54 కోట్లు!

రామ్ పోతినేని, శ్రీలీల జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'స్కంద'. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 15న విడుదల కానుంది. ఇటీవల రిలీజైన ట్రైలర్ మాస్ ని మెప్పించింది. బోయపాటి మార్క్ మాస్, రామ్ ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ కలిసి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేయడం ఖాయమనే అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లే బిజినెస్ కూడా భారీస్థాయిలో జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ రూ.55 కోట్లకు పైగా చేయగా, నాన్-థియేట్రికల్ బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతోంది అంటున్నారు.

'స్కంద' సౌత్ భాషల శాటిలైట్, డిజిటల్ రైట్స్ ని ఏకంగా రూ.54 కోట్లకు స్టార్ గ్రూప్ దక్కించుకుందని సమాచారం. ఇది కేవలం రామ్ కెరీర్ హైయెస్ట్ మాత్రమే కాదు.. టైర్-2 హీరోల సినిమాల్లోనే రికార్డు డీల్స్ లో ఒకటిగా చెబుతున్నారు. డబ్బింగ్ సినిమాలతో నార్త్ లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న రామ్ నుంచి వస్తున్న మొదటి పాన్ ఇండియా మూవీ కావడంతో.. హిందీలో కూడా ఈ సినిమా అదిరిపోయే బిజినెస్ చేసిందని అంటున్నారు. హిందీలో థియేట్రికల్, శాటిలైట్, డిజిటల్ కలిపి రూ.35 కోట్లు బిజినెస్ చేసిందట. మొత్తానికి రికార్డు స్థాయి థియేట్రికల్, నాన్-థియేట్రికల్ బిజినెస్ జరగడం చూస్తుంటే విడుదలకు ముందే మేకర్స్ భారీ లాభాలను చూస్తున్నారని అర్థమవుతోంది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.