English | Telugu
అల్లు అర్జున్ తమిళ హీరో కొట్టుకుంటారా?
Updated : Jul 22, 2015
అల్లు అర్జున్ తో చేయబోయే కొత్త సినిమా కోసం బోయపాటి తెగ కష్టపడుతున్నాడట. బన్నీతో హిట్ కొట్టి ఎలాగైన మెగా కాంపౌండ్ లో పాగా వేయాలని ఆలోచిస్తున్నాడట. ఈ సినిమా కోసం కథ, క్యారెక్టర్లు అన్ని కొత్తగా వుండేలా ప్లాన్ చేస్తున్నాడట. దానిలో భాగంగా ఓ హీరోని విలన్ గా మార్చబోతున్నాడట.
బన్నీ సినిమా కోసం బోయపాటి తమిళ హీరో ఆది పినిశెట్టిని విలన్ గా ఎంచుకున్నట్లు సమాచారం. ఆది తెలుగు లో హీరోగా కొన్ని సినిమాలు చేసిన అవి అంతగా ఆడలేదు. కానీ తమిళంలో హీరోగా అతడికి మంచి పేరే ఉంది. అతణ్ని విలన్ గా చేయాలన్న ఆలోచన బోయపాటికి ఎలా వచ్చిందో గానీ, ఆది కూడా వెంటనే ఓకే అనేశాడట. లెజెండ్’తో జగపతి బాబుకి కేరియార్ కి బూస్ట్ ఇచ్చిన బోయపాటి, ఆదికి కూడా టాలీవుడ్ లో టర్నింగ్ పాయింట్ ఇస్తాడేమో వేచి చూడాలి.