English | Telugu
'బాహుబలి' థియేటర్ పై పెట్రో బాంబు
Updated : Jul 22, 2015
బాహుబలి సినిమా రికార్డుల కలేక్షన్లతో పాటు కేసుల గోలలు కూడా ఎక్కువవుతున్నాయి. బాహుబలి లో మాల కులస్థులను అవమానపరిచే సన్నివేశాలు వున్నాయని వాటిని వెంటనే తొలగించాలని తెలంగాణ మాలల జేఏసీ డిమాండ్ చేసి, పోలీసులకు కంప్లయింట్ చేసింది. అలాగే మదురై లో బాహుబలి సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్ లో పెట్రో బాంబు దాడి జరిగింది. తమిళ పులి సంస్థకు చెందిన కార్యకర్తలుఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ సినిమాలో గిరిజనులను కించపరిచే డైలాగుల వున్నాయని థియేటర్ పై పెట్రో బాంబు దాడి చేశారట. ఆ డైలాగులను వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.