English | Telugu

అష్షు రెడ్డి 'ఏ మాస్టర్ పీస్' ఫస్ట్ లుక్ వచ్చేస్తోంది!

జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అష్షు రెడ్డి బుల్లితెర మీద సందడి చేస్తూనే సినిమా ఛాన్సెస్ ని అందిపుచ్చుకుంటోంది. ఎట్టకేలకు సిల్వర్ స్క్రీన్ వరకూ రీచ్ ఐపోయింది. 'ఏ మాస్టర్ పీస్' అనే మూవీలో అష్షు కనిపించబోతోంది. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ అనేది 12 వ తేదీన రిలీజ్ కాబోతోంది. అనౌన్స్ మెంట్ పోస్టర్ ని అటు అరవింద్ కృష్ణ, ఇటు అష్షు ఇద్దరూ తమ ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకున్నారు. 'ఏ మాస్టర్ పీస్' పేరుతో రూపొందుతున్న ఈ మూవీలో ఆద్య అనే పాత్రలో అషూరెడ్డి కనిపించబోతోంది.

'శుక్ర', 'మాటరాని మౌనమిది' వంటి మూవీస్ తో టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు సుకు పూర్వాజ్. కమర్షియల్ గా రెండు చిత్రాలు మంచి సక్సెస్ ని అందుకున్నాయి. ఇక ఈ డైరెక్టర్ తాజాగా 'ఏ మాస్టర్ పీస్' తో ఆడియన్స్ ముందుకు త్వరలో రాబోతున్నారు.

తొలి సినిమానే డిఫరెంట్ కాన్సెప్ట్ తో రాబోతుండడంతో అషు రెడ్డికి ఈ సినిమా మంచి సక్సెస్ ని అందిస్తోంది అంటున్నారు ఆమె ఫాన్స్. గ్లామర్‌‌‌‌తో పాటు పెర్‌‌‌‌ఫార్మెన్స్‌‌కు ఇంపార్టెన్స్‌‌ ఉన్న పాత్రను పోషిస్తోంది అష్షు. హీరోయిన్‌‌గా మంచి కమర్షియల్‌‌ బ్రేక్‌‌ కోసం ఎన్నాళ్లగానో వెయిట్ చేస్తున్న అషూరెడ్డికి ఈ మూవీ ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి. అష్షు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అప్ డేట్స్ ని షేర్ చేసుకుంటూ అప్పుడప్పుడు గ్లామర్ షోస్ తో ఫాన్స్ కి మంచి విందు చేస్తూ ఉంటుంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .