English | Telugu

నేను సూపర్ హీరోగా చేయాలనుకోవడానికి కారణం అతనే

యువ నటుడు అరవింద్ కృష్ణ చూడడానికి మంచి హైట్ తో అందంగా కనిపించే ఇతను "ఆలస్యం అమృతం, ఇట్స్ మై లవ్‌ స్టోరీ, ఋషి, ఆంధ్రాపోరీ, ప్రేమమ్‌, రామారావు ఆన్ డ్యూటీ" వంటి మూవీస్ లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈ యాక్టర్‌ కొత్త సినిమా అప్‌డేట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.

అరవింద్ కృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ "ఏ మాస్టర్ పీస్". ఇదివరకెన్నడూ చూడని కొత్త తెలుగు సూపర్ హిరోగా అరవింద్‌ కృష్ణ ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. ఇతనికి జతగా అష్షు కనిపిస్తోంది. అరవింద్ కృష్ణ యాక్టర్ మాత్రమే కాదు బాస్కెట్ బాల్ ప్లేయర్ కూడా. ఇతను తన అప్ డేట్స్ ని అలాగే తన బిడ్డ అద్వైత్ తో ఎంజాయ్ చేసే టైంని వీడియోస్ తీసి తన ఫాన్స్ కోసం ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు తన బిడ్డను ఎత్తుకున్న ఒక ఫోటో పెట్టి "నేను సూపర్‌హీరో పాత్రను చేయాలనుకోవడానికి ఒక కారణం ఉంది అది ఏమిటంటే, నా కొడుకు దగ్గర అలా ఉండాలి అనుకుంటున్నా అందుకే ఈ రోల్ చేసాను. నేను అతని సూపర్ హీరోని" అని కామెంట్ పెట్టాడు. ఇక ఈ పిక్ ని చూసిన నెటిజన్స్ "సూపర్ డాడీ, క్యూట్ పిక్, నైస్ క్లిక్, గాడ్ బ్లెస్స్ యు బోత్, క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్, అల్ ది బెస్ట్" అని కామెంట్స్ చేస్తున్నారు.

ఈ యువ నటుడు ఆచి తూచి డిఫరెంట్ స్టోరీస్ ని ఎంచుకుంటూ వెళ్తున్నాడు. యాక్షన్‌ థ్రిల్లర్ జోనర్‌లో 'అండర్ వరల్డ్‌ బిలియనీర్స్' అనే మూవీలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ ఫస్ట్‌ లుక్ పోస్టర్ ను కూడా రీసెంట్ గానే రిలీజ్ చేశారు మేకర్స్.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.