English | Telugu

కృతిస‌న‌న్ ప్రేమికుడి పేరేంటో తెలుసా?

కృతిస‌న‌న్ ఇప్పుడు మోస్ట్ హ్యాపెనింగ్ ఫీమేల్ స్టార్‌. చేతినిండా సినిమాల‌తో, సోష‌ల్ మీడియా నిండా ఫొటోల‌తో నిత్యం వార్త‌ల్లో ఉంటూనే ఉన్నారు. దానికి తోడు ఈ బ్యూటీ అప్పుడ‌ప్పుడూ సోష‌ల్ మీడియాలో ఆస్క్ మీ ఎనీథింగ్ సెష‌న్ కండ‌క్ట్ చేస్తూనే ఉంటారు. ఈ సెష‌న్‌ని డీప్‌గా గ‌మ‌నిస్తే చాలా బ్యాక్ స్టేజ్ విష‌యాలు తెలుస్తుంటాయి. త‌న కో స్టార్స్ కార్తిక్ ఆర్య‌న్‌, వ‌రుణ్ ధావ‌న్ గురించి చాలా విష‌యాల‌ను పంచుకుంటూ ఉంటారు కృతిస‌న‌న్‌. కేవ‌లం వృత్తిప‌ర‌మైన విష‌యాల‌నే కాదు, వ్య‌క్తిగ‌త‌మైన విష‌యాల‌ను కూడా ఈగ‌ర్‌గా షేర్ చేస్తూ ఉంటారు. అలాంటి ఓ సంద‌ర్భ‌మే ఇటీవ‌ల ఎదురైంది.ఇంత‌కీ మీ బాయ్‌ఫ్రెండ్ పేరేంటండీ అని అడ‌గ‌నే అడిగేశాడు ఓ నెటిజ‌న్‌. ఇంకో నాయికైతే కంగారుప‌డేదేమోగానీ, కృతిస‌న‌న్ ఇలాంటి వాటిలో ఆరితేరిపోయారు. ``అది చాలా సీక్రెట్‌. మీకే కాదు, నాక్కూడా`` అంటూ చాలా సింపుల్‌గా, స‌ర‌దాగా ఆన్స‌ర్ ఇచ్చేశారు. ఆ మాట విని చాలా మంది వామ్మో మామూలు ముదురు కాదు అంటూ మీమ్స్ కూడా క్రియేట్ చేసేస్తున్నారు.

కృతిస‌న‌న్‌కి ఆ మ‌ధ్య ప్ర‌భాస్‌తో ల‌వ్ ఉందంటూ వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. అయితే తాము పార్టిసిపేట్ చేసిన షోలో ఈ విష‌యం గురించి స‌ర‌దాగా అన్న మాట‌లు తీవ్రంగా వైర‌ల్ అయ్యాయ‌ని, అస‌లు అలాంటిదేమీ లేద‌ని, బ‌బుల్‌ని బ్లాస్ట్ చేసేస్తున్నాన‌ని అన్నారు కృతిస‌న‌న్‌. ఈ విష‌యం గురించి, ఆ త‌ర్వాత కూడా ఆమెను చాలా మంది ఆరా తీస్తూనే ఉన్నారు. ఆమె ప‌ట్టించుకోనట్టు వ్య‌వ‌హ‌రిస్తూనే ఉన్నారు. కృతి న‌టించిన షెహ్‌జాదా ఇటీవ‌ల విడుద‌లైంది. ఆ సినిమా అక్క‌డ పెద్ద‌గా ఆడ‌లేదు. అందుకే ఇప్పుడు ఆమె ఆశ‌ల‌న్నీ ఆదిపురుష్ మీదే పెట్టుకున్నారు. ఈ సినిమాతో పాటు నార్త్ లో మ‌రికొన్ని ప్రాజెక్టుల్లో న‌టిస్తున్నారు కృతి. మ‌రోవైపు ఎంట్ర‌ప్రెన్యుయ‌ర్‌గా కూడా రాణించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.ఫ్యాష‌న్ వ‌ర‌ల్డ్ లో ఎప్ప‌టిక‌ప్పుడు ఏం జ‌రుగుతుందో తెలుసుకుంటూ ట్రెండీగా ఉండ‌టంలో ఆమెను మించిన వారు లేర‌న్న‌ది టాక్.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .