English | Telugu

ఒకే ఒక సాంగ్ తో రికార్డులు సృష్టిస్తున్న వెంకటేష్

విక్టరీ వెంకటేష్ హీరోగా వస్తున్నలేటెస్ట్ మూవీ సైంధవ్. ఈ మూవీ మీద అటు వెంకటేష్ అభిమానుల్లోను ప్రేక్షకుల్లోను భారీ అంచనాలే ఉన్నాయి. ఆల్రెడీ విడుదలైన టీజర్ తో సినిమా హిట్ అనే సంకేతాలు కూడా ఫిలిం సర్కిల్స్ లో వినపడుతున్నాయి.ఇప్పుడు లేటెస్ట్ గా సైంధవ్ నుంచి వచ్చిన సాంగ్ ఒకటి సినిమా మీద అంచనాలని పెంచేసింది.

సైంధవ్ మూవీ నుంచి ఈ రోజు సాయంత్రం ఒక సాంగ్ రిలీజ్ అయ్యింది. రాంగ్ యూసేజ్ అనే పల్లవితో ప్రారంభం అయిన ఈ సాంగ్ ఇప్పుడు ఫిలిం మార్కెట్ లో రికార్డులు సృష్టిస్తుంది. ఆస్కార్ విజేత చంద్రబోస్ రాసిన ఈ గీతాన్నిసింగర్ నకాష్ అజీజ్ అధ్బుతంగా ఆలపించగా మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ సూపర్ గా ట్యూన్ చేసాడు. ఈ పాట విన్న వెంకీ ఫ్యాన్స్ అండ్ మ్యూజిక్ లవర్స్ పాట చాలా బాగుందని లిరిక్స్ కూడా సూపర్ గా ఉన్నాయని రాబోయే రోజుల్లో మ్యూజిక్ చార్ట్ లో ఆ సాంగ్ టాప్ లో నిలవడం ఖాయమని అంటున్నారు.

2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల అవుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సైంధవ్ లో వెంకటేష్ సరసన శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా చేస్తుంది. రుహానీ శర్మ,నవాజుద్దీన్ సిద్దిఖీ తో పాటు తమిళ నటుడు ఆర్య కూడా ఒక కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్నఈ మూవీకి శైలేష్ కొలను దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు.