English | Telugu

మెగా అభిమాని మృతి.. 'విరూపాక్ష' టీజర్ వాయిదా!

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పోషిస్తున్న తాజా చిత్రం 'విరూపాక్ష'. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ దండు దర్శకుడు. జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో ఇప్పటికే విడుదలైన 'విరూపాక్ష' గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈరోజు(మార్చి 1న) ఈ మూవీ టీజర్ విడుదల కావాల్సి ఉండగా అనుకోని సంఘటన వలన వాయిదా పడింది.

పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా నేడు 'విరూపాక్ష' టీజర్ విడుదల చేయాలని మేకర్స్ భావించారు. ఇప్పటికే ఈ టీజర్ ని చూసిన పవన్ మూవీ టీమ్ ని అభినందించారు. అయితే మెగా అభిమాని, భీమవరం సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ రావూరి పండు కన్నుమూయడంతో.. ఆయనకు నివాళులు అర్పిస్తూ ఈరోజు విడుదల కావాల్సిన 'విరూపాక్ష' టీజర్ ని వాయిదా వేస్తున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు.

సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. సుకుమార్ స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నాడు. 2023, ఏప్రిల్ 21న తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.