English | Telugu
పరిచయంలేకపోయినా పెళ్ళికి వచ్చిన పవన్!
Updated : Mar 1, 2023
హోమ్లీ ఇమేజ్‌తో హీరోయిన్‌గా తనకు వచ్చిన వరుస అవకాశాలను సొంతం చేసుకొని మంచి ఇమేజ్‌ని సొంతం చేసుకుంది లయ. స్వయంవరంతో తెలుగులోకి హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. ఆమెకి ప్రేమించు మిస్సమ్మ వంటి మంచి హిట్స్ ఉన్నాయి. అలాగే బాలకృష్ణ సరసన కూడా నటించింది. 2006లో అమెరికన్ డాక్టర్ గణేష్‌ను వివాహం చేసుకున్నాక లయ సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. ఆ మధ్య అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో హీరోయిన్‌కి తల్లిగా చిన్న పాత్రలో నటించింది లయ. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ‘పవన్ కళ్యాణ్ గారు నా పెళ్ళికి రావడం జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకం. నేను పవన్ కళ్యాణ్ గారితో ఏ సినిమాలో నటించకపోయినా నా పెళ్లికి ఆహ్వానిస్తే వచ్చారు.
పెళ్ళికి ఆహ్వానించేందుకు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్లాను. అప్పుడు నాకు అపాయింట్మెంట్ లేకపోయినా ఆయన నన్ను ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించారు. చాలాసేపు మాట్లాడారు. పెళ్లి పత్రిక ఇచ్చి ఆహ్వానించాను. తప్పకుండా వస్తాను అన్నారు. అయితే నేను ఊరికినే అన్నారు అనుకున్నా. కానీ నా పెళ్ళికి వచ్చారు. ఎటువంటి హంగామా సమాచారం లేకుండా రావడంతో పవన్ కళ్యాన్ కు మర్యాదలు చేయలేకపోయాను.
చిరంజీవి గారు కూడా నా పెళ్ళికి వచ్చారు. చిరంజీవి గారితో నాకు పరిచయం ఉంది. ఇండస్ట్రీ పెద్దగా ఆయన వచ్చారు. కానీ పరిచయం లేకుండా పవన్ కళ్యాణ్ గారు రావడం ఆయన ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం’ అని లయ పేర్కొంది. అలాగే తన ఫ్యామిలీ గురించి చెబుతూ... నా కూతుర్ని హీరోయిన్‌గా చూడాలని ఆశ ఉంది. అయినా అవకాశాల కోసం ఎవరిని అడగను. అలాగే తనను కూడా హీరోయిన్ అవ్వమని బలవంతం చేయను అని చెప్పింది.