English | Telugu
లవ్ స్టోరీ చెయ్యాలని ఉంది.. అగ్ర హీరో కోరిక
Updated : Oct 17, 2023
విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న సైంధవ్ మూవీ జనవరి 13 2024 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. వెంకటేష్ సినీ కెరీర్ లోనే మొట్ట మొదటి సారిగా పాన్ ఇండియా లెవెల్లో
సైంధవ్ మూవీ విడుదల కాబోతుంది. ఇటీవలే ఈ మూవీ కి సంబంధించిన టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా విక్టరీ వెంకటేష్ కొన్ని మీడియా సంస్థలకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అప్పుడు ఆయన తనకి ఎలాంటి సినిమా చెయ్యాలని ఉందనే విషయాన్ని బయటపెట్టి యువ దర్శకులకి, రైటర్ ల పెన్నుకీ పని చెప్పాడు.
విక్టరీ వెంకేటేష్..మూడు దశాబ్దాల తన సినీ కెరీర్ లో ఆయన చూడని విజయం లేదు. తన సినిమా ల ద్వారా తెలుగు సినిమా పరిశ్రమలో రికార్డు కలెక్షన్స్ లని సృష్టించాడు. తాజాగా ఆయన
చాలా సంవత్సరాల గాప్ తర్వాత సైంధవ్ తో తన సత్తా చాటబోతున్నాడు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన టీజర్ అయితే విడుదల అయిన కొన్ని గంటల్లోనే రికార్డు వ్యూయర్స్ ని సాధించింది. అలాగే శత్రువుల దృష్టిలో సైతాన్ గా మారి సైంధవ్ లో వెంకేటేష్ తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడని అర్ధం అవుతుంది.
ఇక అసలు విషయానికి వస్తే వెంకటేష్ సైంధవ్ టీజర్ రిలీజ్ సందర్భంగా కొన్ని మీడియా సంస్థలకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అక్కడ తనకి పలానా టైపు సినిమా చెయ్యాలని ఉందని తన మనసులో ని కోరికని వెల్లడి చేసాడు. నాకు మెచ్యూర్డ్ లవ్ స్టోరీ చెయ్యాలని ఉందని ఎవరైనా రైటర్,దర్శకుడు ఆ దిశగా స్టోరీ రెడీ చేసుకొని వస్తే నటించడానికి సిద్ధంగా ఉన్నానని వెంకటేష్ వెల్లడించాడు. దీంతో కొంత మంది రైటర్ లు, దర్శకులు వెంకటేష్ కోసం కథలు రెడీ చేసే పనిలో ఉన్నారు.ప్రేమ,ప్రేమించుకుందాం రా ,ప్రేమంటే ఇదేరా,కలిసుందాం రా ,ధర్మ చక్రం లాంటి మూవీల్లో లవర్ బాయ్ గా వెంకటేష్ ఎంత బాగా నటించాడో అందరికి తెలిసిందే.