English | Telugu

మెగా హీరోలకు లక్కీ చార్మ్ గా మారిన వెంకటేష్!

మెగా హీరోల పాలిట వరంలా విక్టరీ వెంకటేష్(Venkatesh) మారిపోయారా. 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Vara Prasad Garu) సినిమా విడుదల సందర్భంగా వెంకటేష్ అభిమానులు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే విషయం గురించి చర్చించుకుంటున్నారు.

మెగా హీరోతో వెంకటేష్ స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది 2015లో వచ్చిన 'గోపాల గోపాల' సినిమాతో మొదలైంది. ఇందులో ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తెరను పంచుకున్నారు. ఈ చిత్రం ప్రేక్షకుల మెప్పు పొందింది.

పవన్ కళ్యాణ్ తర్వాత మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ తో కలిసి రెండు సినిమాల్లో నటించాడు వెంకటేష్. వీరిద్దరూ కలిసి నటించిన 'ఎఫ్-2' బ్లాక్ బస్టర్ గా నిలవగా, 'ఎఫ్-3' కూడా మెప్పించింది.

ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు'లో ప్రత్యేక పాత్ర పోషించాడు వెంకటేష్. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో అడుగుపెట్టనుంది. వెంకటేష్ ఉన్నాడు కనుక సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి ఈ సినిమా కూడా హిట్ అవ్వడం ఖాయమని వెంకీ ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

అదే జరిగితే పవన్ కళ్యాణ్ కి 'గోపాల గోపాల', వరుణ్ తేజ్ కి 'ఎఫ్-2', చిరంజీవికి 'మన శంకర వరప్రసాద్ గారు'తో హిట్స్ ఇచ్చిన మెగా లక్కీ చార్మ్ గా వెంకటేష్ నిలుస్తాడు.