English | Telugu

అజిత్ ఫ్యాన్స్ కి గుడ్‌న్యూస్‌!

అజిత్ ఫ్యాన్స్ కి ఇది నిజంగానే గుడ్ న్యూసే! మార్చి మొద‌టి వారంలో అజిత్ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. మ‌గిళ్ తిరుమేని ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను అంత‌లోపే కంప్లీట్ చేస్తాన‌ని మాటిచ్చేశార‌ట‌. జూన్ ఎండింగ్‌, జులై ఫ‌స్ట్ వీక్‌కి షూటింగ్ పార్టు కంప్లీట్ చేసేయ‌వ‌చ్చ‌ని పేప‌ర్ మీద లెక్క‌లు కూడా వేసి చూపించార‌ట‌. త‌క్కువ లొకేష‌న్ల‌లో, యాక్ష‌న్ ప్యాక్డ్ మూవీగా ప్లాన్ చేస్తున్నార‌ట మ‌గిళ్ తిరుమేని. జులైకి షూటింగ్ పూర్త‌యితే, నిర‌భ్యంత‌రంగా దీపావ‌ళి రేసులో అజిత్ మూవీని నిల‌బెట్టాల‌న్న‌ది ప్లాన్‌. హీరోయిన్‌గా మంజు వారియ‌ర్ పేరు వినిపిస్తోంది. అన్నీ ఫైన‌లైజ్ అవ్వ‌గానే ప్ర‌క‌టించాల‌న్న‌ది మేక‌ర్స్ ప్లాన్‌.

లాస్ట్ మంత్ 11న విడుద‌లైంది అజిత్ తునివు. అదే తేదీన ప్రేక్ష‌కుల‌ను పల‌క‌రించారు ద‌ళ‌ప‌తి విజ‌య్‌. ఆ సినిమా విడుద‌ల కావ‌డం, ఆ వెంట‌నే లోకేష్ క‌న‌గరాజ్ సినిమాను ప్రారంభించ‌డం కూడా పూర్త‌యింది. ఇప్పుడు కాశ్మీర్‌లో షూటింగ్‌లో ఉంది విజ‌య్ - లోకేష్ టీమ్‌. అక్టోబ‌ర్ 19న సినిమాను విడుద‌ల చేస్తామ‌ని జ‌బ‌ర్ద‌స్త్ గా అనౌన్స్ చేసేశారు లోకేష్‌. తునివు విడుద‌ల కాగానే ఫారిన్ ట్రిప్‌కి వెళ్లారు అజిత్‌. ఆయ‌న ఫ్యామిలీతో గ‌డిపిన ఫొటోలు వైర‌ల్ అయ్యాయి. అజిత్ స‌తీమ‌ణి షాలిని కూడా కొన్ని ఫొటోల‌ను షేర్ చేశారు. ఇటీవ‌లే ట్రిప్ నుంచి తిరిగి వ‌చ్చారు అజిత్‌. ఆ వెంటనే మ‌గిళ్ తిరుమేనితో మీటింగ్ పెట్టి మార్చి నుంచి జులై వ‌ర‌కు టైమ్ స్పెండ్ చేస్తాన‌ని చెప్పేశార‌ట‌.

ఈ సినిమా రిలీజ్ కాగానే, ఏడాది పాటు కెరీర్‌లో బ్రేక్ తీసుకోవాల‌నుకుంటున్నార‌ట అజిత్‌. త‌న బైక్ మీద ప్ర‌పంచ ప‌ర్య‌ట‌న చేయాల‌న్న‌ది ఆయ‌న సంక‌ల్పం. ఈ ట్రిప్‌లో అజిత్‌కి మంజువారియర్ కంపెనీ ఇవ్వ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నార‌ట‌. మంజు వారియ‌ర్ చాలా బాగా బైక్ డ్రైవ్ చేస్తారు. రీసెంట్‌గా బీఎండ‌బ్ల్యూ బైక్ తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా త‌న‌కు ఇన్‌స్పిరేష‌న్‌గా నిలిచిన అజిత్‌కి కూడా థాంక్స్ చెప్పారు. వార్త‌ల్లో ఉన్న‌ట్టు అజిత్ నెక్స్ట్ సినిమాలో మంజు వారియ‌ర్ హీరోయిన్ అయితే, ఆ సినిమాను కంప్లీట్ చేయ‌గానే ఇద్ద‌రూ ట్రిప్‌కి వెళ్ల‌డం ఖాయం అన్న‌మాట‌.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .