English | Telugu

వార్ 2 ,కూలీ ని మించిన సినీ వినోదం.. ఈ వారం థియేటర్, ఓటిటి చిత్రాలు ఇవే 

గత వారం 'వార్ 2 (War 2)''కూలీ'(Coolie)వంటి భారీ చిత్రాలు థియేటర్స్ లో సందడి చేసిన విషయం తెలిసిందే. దీంతో మూవీ లవర్స్ కి కావాల్సినంత సినీ వినోదం దొరకడంతో, వర్షాలని సైతం లెక్కచెయ్యకుండా థియేటర్స్ కి పోటెత్తారు. ఈ వారం కూడా పలు చిత్రాలు థియేటర్స్ తో పాటు ఓటిటిలో కావాల్సినంత సినీ వినోదాన్ని అందించనున్నాయి.

ప్రేమకథా చిత్రాలతో పాటు, టిల్లుస్క్వేర్ తో యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న నటి అనుపమ పరమేశ్వరన్(Anupama parameswaran).ఇప్పుడు తన పంధాని పూర్తిగా మార్చుకొని హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ 'పరదా'(Parada)తో ఈ నెల 22 న థియేటర్స్ లో సందడి చేయనుంది. సోషల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కగా, ప్రచార చిత్రాలు 'పరదా' పై ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఒకప్పటి హీరోయిన్ సంగీత, మలయాళ అగ్ర నటుడు, ప్లే బ్యాక్ సింగర్ 'దర్శన్ రాజేందర్' ముఖ్య పాత్రలు పోషించారు. తెలుగు, మలయాళ భాషల్లో విడుదల కానుంది. '2021 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'సినిమా బండి' మూవీతో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా చేత జ్యురి అవార్డు అందుకున్న ప్రవీణ్ కాండ్రేగుల(Praveen kandregulaదర్శకుడు. రీసెంట్ గా సమంత నిర్మాణ సారధ్యంలో వచ్చిన హర్రర్ కామెడీ 'శుభం' కూడా ప్రవీణ్ దర్శకత్వంలోనే వచ్చింది.

ఇదే రోజు 'ఆర్ నారాయణమూర్తి'(R. Narayanamurthy)స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'యూనివర్సిటీ పేపర్ లీక్'(University Paper Leak)చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. పేపర్ లీక్ అణుబాంబు కంటే ప్రమాదమనే కాన్సెప్ట్ తో తెరకెక్కగా, దర్సకుడు త్రివిక్రమ్(Trivikram)తో పాటు, పలువురు కవులు,రాజకీయనాయకులు ఇప్పటికే ఈ చిత్రాన్ని చూసి మెచ్చుకోవడం జరిగింది. అగస్ట్ 22 మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)బర్త్ డే సందర్భాన్ని పురస్కరించుకొని, ఆయన కెరీర్ లోనే ప్రత్యేకమైన మూవీగా నిలిచిన 'స్టాలిన్'(Stalin)రీ రిలీజ్ కాబోతుంది. సోషల్ మెసేజ్ తో కూడిన ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు 'ఏ ఆర్ మురుగదాస్'Ar Murugadoss)దర్శకత్వం వహించగా త్రిష హీరోయిన్ గా చేసింది. ఖుష్బూ, ప్రకాష్ రాజ్,రవళి, సునీల్ కీలక పాత్రలు పోషించారు.
ఓటిటి వేదికగా చూసుకుంటే నెట్ ఫ్లిక్స్ లో
అగస్ట్ 20
1 . రివర్స్ ఆఫ్ ఫేట్(బ్రెజిల్ వెబ్ సిరీస్) ఒక టీనేజర్ ని సెక్స్ ట్రాఫికింగ్ ముఠా కిడ్నాప్ చేసినప్పుడు,సదరు యువతి జీవితంలో ఏర్పడిన పరిస్థితుల ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కింది. ప్రేమ, ద్రోహం, ఒంటరితనం అనే అంశాలని ప్రస్తావించారు.
అగస్ట్ 21
2 . హోస్టేజ్( బ్రిటిష్ వెబ్ సిరీస్) పొలిటికల్ యాక్షన్ డ్రామా, లవ్, ఎమోషనల్ వంటి కధాంశాలతో ఈ సిరీస్ తెరకెక్కింది.
అమెజాన్ ప్రైమ్ లో
అగస్ట్ 22
రోడ్ ఆన్ మిలియన్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) గూడాచారి నేపథ్యంలో ఈ సిరీస్ తెరకెక్కింది.
జియో హాట్ స్టార్
అగస్ట్ 21
పీస్ మేకర్ సీజన్ 2 (అమెరికన్ వెబ్ సిరీస్) సూపర్ హీరో నేపథ్యంలో ఈ సిరీస్ తెరకెక్కగా దేశ భదత్ర గురించి ఈ సిరిస్ లో చెప్పనున్నారు.
ఆహా లో
అగస్ట్ 18
కొత్తపల్లిలో ఒకప్పుడు(తెలుగు మూవీ) కామెడీ డ్రామా గా తెరకెక్కగా మంచి రివ్యూస్ నే అందుకుంది. మనోజ్ చంద్ర, మోనికా, ఉష, రవీంద్ర విజయ్ కీలక పాత్రలు పోషించగా, రానా దగ్గువాటి సమర్పుకుడిగా వ్యవహరించాడు.

యాపిల్ టీవీ
అగస్ట్ 22
ఇన్ వేషన్ సీజన్ 3 (అమెరికన్ వెబ్ సిరీస్) గ్రహాంతరవాసుల నుంచి వచ్చే ముప్పుని ఎలా ఎదురుకున్నారనే సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందింది. ఈ విధంగా పలు విభిన్న చిత్రాలు, వెబ్ సిరీస్ లు థియేటర్స్, ఓటిటి వేదికగా సందడి చేయనున్నాయి.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.