English | Telugu
ది ఫ్రీలాన్సర్ వెబ్ సిరీస్ రివ్యూ!
Updated : Sep 1, 2023
వెబ్ సిరీస్: ది ఫ్రీలాన్సర్
నటీనటులు: మోహిత్ రైనా, అనుపమ్ ఖేర్, కశ్మీర పరదేశి, అయేషా రజా మిశ్రా, నవనీత్ మాలిక్, మంజరీ ఫడ్నీస్, గీత అగర్వాల్ శర్మ, జాన్ కొక్కెన్, సారా జేన్ డయాస్
రచన: రితేష్ షా
ఎడిటింగ్: కతికులోత్ ప్రవీణ్
సినిమాటోగ్రఫీ: సుధీర్ పల్సానే
మ్యూజిక్: సంజయ్ చౌదరి
నిర్మాతలు: గౌరవ్ బెనర్జీ, వరుణ్ మాలిక్, మహేశ్ మీనన్
బ్యానర్: ఫ్రైడే స్టోరీటెల్లర్స్, జాక్ ప్రొడక్షన్స్
దర్శకత్వం: నీరజ్ పాండే
ఓటిటి : డిస్నీ ప్లస్ హాట్ స్టార్
'ఎమ్. ఎస్ ధోనీ' సినిమాతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న డైరెక్టర్ నీరజ్ పాండే తీసిన వెబ్ సిరీస్ ' ది ఫ్రీలాన్సర్'. అనుపమ్ ఖేర్ ముఖ్య పాత్ర పోషించిన ఈ సిరీస్ కథేంటో ఒకసారి చూసేద్దాం...
కథ:
ఒక నగరం రోడ్డు మీద కొందరు దుండగులు వెంబడిస్తుంటే, వారి నుండి తప్పించుకుంటూ ఒక అమ్మాయి పరుగెత్తుకుంటూ వెళ్తుంది. అయితే అలా తప్పించుకుంటూ వెళ్తున్న ఆ అమ్మాయి ఒక కార్ ని ఢీకొట్టి మళ్ళీ వారికే దొరికిపోతుంది. ఆ అమ్మాయి పేరు 'అలియా'. ఆ అమ్మాయి సిరియాలో చిక్కుకొని ఉంటుంది. అలియా వాళ్ళ నాన్న ఇనాయత్ ఖాన్.. అతని ఫ్యామిలీ ఇండియాలోని ముంబైలో నివసిస్తుంటుంది. అయితే అలియాకి కాలేజీలో ఒక అబ్బాయి పరిచయమవుతాడు. వారి పరిచయం ప్రేమగా మారి, వాళ్ళిద్దరి ప్రేమని రెండు కుటుంబాలు ఒప్పుకొని పెళ్ళి జరిపిస్తాయి. అయితే పెళ్ళి జరిగిన మరుసటి రోజు అలియా వాళ్ళ అత్తయ్య, మామయ్య అందరూ కలిసి మలేషియాలోని కౌలాలంపూర్ కి హానీమూన్ వెళ్దామని ఎయిర్ పోర్ట్ కి వెళ్తారు. అయితే అక్కడ వారి నిర్ణయం మారిపోతుంది. వాళ్ళు టర్కీలోని ఇస్తాంబుల్ కి వెళ్తారు. అలా అలియా వాళ్ళంతా ఇస్తాంబుల్ కి వెళ్తారు. అక్కడి నుండి సిరియాకి వెళ్తారు. అయితే అలియాకి ఇదంతా నచ్చదు, అక్కడి నుండి బయటపడాలనుకుంటుంది. అయితే ఈ కేస్ ని ఫ్రీలాన్సర్ అయిన అవినాష్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. అయితే ఇతను అండర్ కవర్ ఆపరేషన్ చేస్తుంటాడు. మరి చాలా డేంజరస్ అయిన సిరియా నుండి అలియాని అవినాష్ ఇండియాకి తీసుకొచ్చాడా లేదా అనేది మిగతా కథ..
విశ్లేషణ:
ఒక అమ్మాయిని ఎందకు అలా వెంబండించి, బంధీంచారు. దాని వెనుక కథేంటని .. కథని ఎత్తుకున్న తీరు బాగుంది. సీక్రెట్ గా ఒక తీవ్రవాద సంస్థ కొంతమంది సంఘ విద్రోహ శక్తులని తయారు చేయడానికి సిద్ధం చేస్తుంటుంది.
మరి అసలేం జరిగింది? అవినాష్ ఆ అమ్మయిని వెనక్కి తీసుకురావడానికి అతనేం చేశాడనేది చూపించిన తీరు బాగుంది. కానీ ప్రతీ చిన్న ఫ్యామిలీ ఎమోషన్ ని కూడా చూపించడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా డ్యూటీ చేసుకుంటున్న అవినాష్ కి ఒక భార్య ఉంటుంది. ఆమె మంజరి.. తనొక మానసిక వ్యాధి గల అమ్మాయి. తను మాట్లాడే విధానం అంతా కూడా బోరింగ్ అనిపిస్తాయి.
అవినాష్ ఇన్వెస్టిగేషన్ సీరియస్ గా సాగిన, మధ్య మధ్యలో వచ్చే సాధారణ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఆ థ్రిల్ ని పోగెట్టేస్తాయి. మొదటి నుండి కథ దూకుడుగా సాగుతుంది. అఫ్గనిస్థాన్ ని తాలిబన్ల చేతిలోకి తీసుకోవడం లాంటివి చాలా కామన్ అన్నట్టుగా చూపించారు. అయితే అటువంటి డేంజర్ ఏరియాలోకి ఆరుగురు ఉన్న ఓ టీమ్ ని తీసుకొని వెళ్ళి, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ని చంపడం కాస్త ఎక్కువ అనిపిస్తుంది. కానీ ఇది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అవినాష్ యొక్క డ్యూటీని స్ట్రాంగ్ గా చూపించడానికి తెలిసిపోతుంది. ఇది ఈ వెబ్ సిరీస్ కి ప్లస్ అయింది. ఇక ఇంటర్ పోల్, మంబై ఇన్వెస్టిగేషన్ టీమ్, ఇలా అన్నీ సమన్వయంతో పనిచేస్తే ఎలా ఉంటుందో సరైన వివరణ ఇవ్వలేకపోయాడు డైరెక్టర్ నీరజ్ పాండే.
దేశంలో టర్రరిజం ఎలా వ్యాప్తిచెందుతుందో ఒక చిన్న పాయింట్ తీసుకొని చూపించడంలో డైరెక్టర్ నీరజ్ పాండే సక్సెస్ అయ్యాడు. అయితే ఇదంతా చూపించడానికి నాలుగు ఎపిసోడ్ లు అనవరసమనిపిస్తుంది. సీక్రెట్ మిషన్ లో ఉన్నప్పుడు ఫ్యామిలీ డ్రామాని తీసేస్తేనే బాగుండేది. అయితే ఫ్యామిలీతో గడిపే కొన్ని సీన్లు తప్ప మిగతాదంతా సీరియస్ గా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అయితే చివరి ఎపిసోడ్ లో కూడా అవినాష్ ఆ అమ్మాయిని తీసుకురాకపోవడం కాస్త నిరాశని కలిగిస్తుంది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తన పవర్ వాడి ఆ అమ్మాయి అలియాని సిరియా నుండి తీసుకురావడానికి విశ్వప్రయత్నాలు చేస్తుంటాడు. అది ఎలా ఉంటుందో అనే క్యూరియాసిటిని పెంచేసి సిరీస్ ని ముగించారు మేకర్స్. మరి వచ్చే సీజన్ లో అయిన అలియాని తీసుకొస్తాడో లేదో చూడాలి మరి. కథ బాగున్నప్పటీకీ కొన్ని బోల్డ్ సీన్స్ ఉన్నాయి. అయితే నిడివి కాస్త ఎక్కువగా ఉండటం చూడటానికి ప్రేక్షకులకు ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇంత అసలు ఈ వెబ్ సిరీస్ కి ఇన్ని ఎపిసోడ్ లు అనవరసమనిపిస్తుంది.
సుదీర్ పల్సానే సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటింగ్ పర్వాలేదు. కాస్త స్లో సీన్స్ తీసేస్తే బాగుండేది. మ్యూజిక్ పర్వాలేదనిపించింది.
నటీనటుల పనితీరు:
అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్ర పోషిస్తూ కథని ఆసక్తిగా మలిచాడు. కేస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఫ్రీలాన్సర్ అవినాష్ పాత్రలో మోహిత్ రైనా ఆకట్టున్నాడు. అవినాష్ భార్యగా మంజరి తన పాత్రకి న్యాయం చేసింది. సారా జేన్ డయాస్, జాన్ కొక్కెన్ వారి పాత్రల పరిధి మేరకు నటించారు.
తెలుగు వన్ పర్ స్పెక్టివ్:
ఇండియన్ రా ఏజెన్సీ, ఇన్వెస్టిగేషన్ బ్యూరో, సీఐఏ వంటి ఇంటలిజెన్స్ బ్యూరోలు దేశంలో పెరిగిపోతున్న మత కల్లోల వెనుక ఉందెవరూ? వాటిని ఎలా పరిష్కారించాలంటూ సాగుతున్న ఈ కథ బాగున్నప్పటికీ, స్లో సీన్స్, ఫ్యామిలీ డ్రామా బోరింగా అనిపిస్తాయి. సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ ని ఇష్టపడేవారు ఇ సిరీస్ ని ఒకసారి ట్రై చేయొచ్చు.
రేటింగ్: 2.5 / 5
✍🏻. దాసరి మల్లేశ్