English | Telugu
సూపర్‌స్టార్ కు రూ.100 కోట్ల సింగిల్ చెక్ అందించిన నిర్మాత
Updated : Sep 1, 2023
సూపర్‌స్టార్ రజనీకాంత్.. దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోగా రికార్డు క్రియేంట్ చేస్తున్నారు. ఇటీవల విడుదలై ప్రపంచవ్యాప్తంగా ఘనవిజయం సాధించి ఇప్పటికీ కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సినిమా ‘జైలర్’. కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమాకి ఊహించని విధంగా కలెక్షన్స్ రావడంతో రజనీ ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేవు. ఇటీవలి కాలంలో సరైన హిట్ లేని రజనీకి ఒక్కసారే భారీ హిట్ వచ్చేసింది. రూ.200 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ‘జైలర్’ మూవీ ఇప్పటికే రూ.600 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇంకా ‘జైలర్’ జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి రజనీకాంత్ రూ.110 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నారు. అంతేకాదు లేటెస్ట్‌గా నిర్మాత కళానిధి మారన్ చెన్నై మందవేలిలోని సిటీ యూనియన్ బ్యాంక్‌కి చెందిన రూ.100 కోట్ల సింగిల్ చెక్‌ను రజనీకి అందించారు. అయితే ఈ చెక్ వచ్చిన ప్రాఫిట్‌లో షేరింగ్ అందించినట్టు తెలుస్తోంది. 72 ఏళ్ళ వయసులోనూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ యంగ్ టాప్ హీరోలకు చుక్కలు చూపిస్తున్న రజనీకాంత్ ఈ ఘటనతో నిజంగానే సూపర్‌స్టార్ అనిపించుకున్నారు. ఒక ఆర్టిస్టు కెరీర్‌లో ఇంతమించిన ఘనత ఏముంటుంది?