English | Telugu
క్రేజీ కాంబోలో మూవీ.. ప్రకటనతోనే పూనకాలు.. ఈ హైప్ తట్టుకోగలరా!
Updated : Aug 31, 2023
'అర్జున్ రెడ్డి' సినిమా ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఈ సినిమాతో హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఓవర్ నైట్ స్టార్స్ అయ్యారు. ప్రస్తుతం విజయ్ పాన్ ఇండియా స్థాయి గుర్తింపు తెచ్చుకుంటే, సందీప్ పాన్ ఇండియా స్టార్స్ తో సినిమాలు చేస్తున్నాడు. విజయ్, సందీప్ ఎంత ఎదిగినా.. వారి పేర్లు వింటే ముందుగా మనకు 'అర్జున్ రెడ్డి'నే గుర్తుకొస్తుంది. విడుదలై ఆరేళ్ళు అవుతున్నా ఆ సినిమా అంతలా ప్రభావం చూపించింది. 'అర్జున్ రెడ్డి'తో అంతలా సంచలనం సృష్టించిన విజయ్, సందీప్ కలయికలో మరో సినిమా వస్తే ఎలా ఉంటుంది?.. ఆ ఆలోచనే ఫుల్ కిక్ ఇస్తుంది కదా.. త్వరలోనే వీరి కాంబోలో రెండో సినిమా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
విజయ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఖుషి'. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా రేపు(సెప్టెంబర్ 1న) ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మైత్రి నిర్మాతలు మాట్లాడుతూ.. విజయ్, సందీప్ రెడ్డి కాంబినేషన్ లో ఓ సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం రణబీర్ కపూర్ తో 'యానిమల్' సినిమా చేస్తున్న సందీప్.. ఆ తర్వాత ప్రభాస్, అల్లు అర్జున్ తో సినిమాలు కమిట్ అయ్యి ఉన్నాడు. ఆ ప్రాజెక్ట్ లు పూర్తయ్యాక విజయ్-సందీప్ కాంబోలో రెండో సినిమాకి అడుగులు పడతాయేమో చూడాలి. ఏది ఏమైనా అర్జున్ రెడ్డి కాంబోలో సినిమా అంటే ప్రకటనతోనే అంచనాలు ఆకాశాన్నంటడం ఖాయం.