English | Telugu
వెకేషన్‌కి వెళ్లిన దళపతి... రిటర్న్ ఎప్పుడు?
Updated : Jul 25, 2023
లియో స్టార్ దళపతి విజయ్ వెకేషన్‌కి వెళ్లారు. దళపతి విజయ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ త్వరలోనే మొదలవుతుంది. అంతలోనే షార్ట్ ట్రిప్‌కి వెళ్లి రిఫ్రెష్ కావాలని అనుకున్నారు. అందుకే వెకేషన్‌కి వెళ్లారు దళపతి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లియో సినిమాలో నటించారు దళపతి విజయ్. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అక్టోబర్ 19న విడుదల కానుంది లియో. తమిళనాడులోని చాలా మంది దర్శకులు ఈ సినిమాలో నటించారు. త్రిష నాయికగా నటించారు. మరోవైపు విజయ్ పొలిటికల్ యాక్టివిటీస్ మీద కూడా విరివిగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన వెకేషన్‌కి వెళ్లడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఇప్పటిదాకా పొలిటికల్ ఎంట్రీ గురించి దళపతి విజయ్ అసలు నోరు విప్పలేదు. జస్ట్ సోషల్ సర్వీస్ మాత్రం చేస్తున్నారు. ఆయన చివరి సినిమా ఏదంటూ ఫ్యాన్స్ మధ్య సీరియస్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. అయితే వాటిని పట్టించుకోవడం లేదు విజయ్.
ఇప్పుడు వెకేషన్‌కి వెళ్లిన విజయ్, లియో ఆడియో వేడుకకు ముందు రిటర్న్ వస్తారన్నది సన్నిహితులు చెబుతున్న మాట. ఎప్పుడూ లో ప్రొఫైల్ మెయింటెయిన్ చేస్తుంటారు దళపతి విజయ్. ఆయన చెప్పకపోయినా, ఆయన సినిమాల గురించి ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ కి ఉప్పందుతూనే ఉంటుంది. ఆయన తదుపరి సినిమా వెంకట్ ప్రభుతో అన్నది కన్‌ఫర్డ్మ్ న్యూస్. ఆ తర్వాత మాత్రం డైరక్టర్ శంకర్‌తో సినిమా చేస్తారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం కమల్‌హాసన్‌తో ఇండియన్2, రామ్‌చరణ్‌తో గేమ్ చేంజర్ సినిమాలు తెరకెక్కిస్తున్నారు డైరక్టర్ శంకర్. ఇవన్నీ పూర్తయ్యాక విజయ్ మూవీ ఉంటుందని టాక్.