English | Telugu

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కొత్త అధ్యక్షుడిగా భరత్ భూషణ్

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కొత్త అధ్యక్షుడిగా భరత్ భూషణ్ ఎన్నికయ్యారు. ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి ఎన్నికైన దిల్ రాజు పదవి కాలం ముగియడంతో నేడు(జూలై 28) అధ్యక్ష పదవి కోసం ఎన్నికలు జరిగాయి. ఈసారి డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. అధ్యక్ష పదవి కోసం భరత్ భూషణ్, ఠాగూర్ మధు పోటీ పడగా.. భరత్ భూషణ్ విజయం సాధించారు. ప్రొడ్యూసర్స్ , ఎగ్జిబిటర్స్ , డిస్ట్రిబ్యూటర్స్ , స్టూడియో సెక్టార్ లోని సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మొత్తం సభ్యులు 48 మంది సభ్యులు కాగా, ఓటింగ్ లో 46 మంది సభ్యులు పాల్గొన్నారు. భరత్ భూషణ్ కి 29 ఓట్లు, ఠాగూర్ మధుకి 17 ఓట్లు పోల్ అయ్యాయి. ఇక ఉపాధ్యకుడిగా అశోక్ కుమార్, వైవీఎస్ చౌదరి పోటీ పడగా.. అశోక్ కుమార్ గెలుపొందారు. అశోక్ కుమార్ కి 28 ఓట్లు, వైవీఎస్ చౌదరి కి 18 ఓట్లు పోల్ అయ్యాయి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.