English | Telugu

బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్!

1974లో విడుదలైన 'తాతమ్మ కల' చిత్రంతో తన సినీ కెరీర్ ను ప్రారంభించిన నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) .. ఈ ఏడాదితో 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ నెలలో రెండు తెలుగు రాష్ట్రాలలో బాలయ్య గోల్డెన్ జూబ్లీ సెలెబ్రేషన్స్ ఘనంగా నిర్వహించబోతున్నారు.

నందమూరి వసుంధర, నందమూరి తేజస్విని పుట్టినరోజు శుభ సందర్భంగా NBK హెల్పింగ్ హ్యాండ్స్ బిగ్ అనౌన్స్ మెంట్ చేసింది. 50 వసంతాల బాలయ్య సినీ స్వర్ణోత్సవ సంబరాలను NBK HELPING HANDS ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ లో అత్యంత వైభవంగా.. లక్షలాది అభిమానుల సమక్షంలో.. అతిరథమహారధులు మధ్య చరిత్రలో శాశ్వతంగా నిల్చిపోయేలా జరపాలని ఘనంగా ఏర్పాట్లు జరగనున్నాయి. ఈ స్వర్ణోత్సవ సంబరం తెలుగు చలనచిత్ర పరిశ్రమ సెప్టెంబర్ 1 హైదరాబాద్ లో నిర్వహించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పెద్దఎత్తున జరగనుంది.

"మన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే మన బాలయ్య కోసం మనమందరం చేసే అతిపెద్ద పండుగ ... ఈ పండుగలో అన్న NTR అభిమానులు , ప్రతి నందమూరి అభిమాన సోదరులందరూ పాల్గొనాలని మనవి. ఈ అవకాశం కల్పించిన బాలయ్య గారికి కృతజ్ఞతలు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాము." అని NBK హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండర్ అనంతపురం జగన్ తెలిపారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.