English | Telugu

బ‌న్నీ సినిమాకి త‌మిళ‌నాట షాక్‌..!

అల్లు అర్జున్‌కి త‌మిళ‌నాట షాక్ త‌గిలింది. స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి సినిమాకి త‌మిళ‌నాడులో ప్ర‌తిఘ‌ట‌న ఎదురైంది. గురువారం ప్ర‌పంచ వ్యాప్తంగా స‌న్నాఫ్ స‌త్యమూర్తి సినిమా విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. త‌మిళ‌నాడులో కూడా అత్య‌ధిక ప్రింట్ల‌తో ఈ సినిమాని విడుద‌ల చేశారు. అక్క‌డ కాంచీపురంతో స‌హా కొన్ని ప్ర‌ధాన‌మైన న‌గ‌రాల్లో ఈ సినిమాని అడ్డుకొన్నారు. స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి ప్ర‌దర్శ‌న నిలిపివేశారు. ఇటీవ‌ల ఎర్ర‌చంద‌నం స్మ‌గ్మ‌ర్ల‌పై ఎన్‌కౌంట‌ర్ జ‌రిపినందుకు నిర‌స‌న‌గా తెలుగు సినిమాల్ని త‌మిళ నాట నిషేధిస్తున్న‌ట్టు దాడి చేసిన‌వాళ్లు చెబుతున్నారు. నాలుగైదు చోట్ల ఇలాంటి సంఘ‌ట‌న‌లు చోటు చేసుకొన్నాయి. దాంతో.. కొన్ని చోట్ల స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి షోలు నిలిపివేశారు. త‌మిళ హీరోలు ఇంచ‌క్కా తెలుగులో మార్కెట్ కోసం సినిమాల్ని విడుద‌ల చేసుకొంటారు. వ‌సూళ్ల‌ను ప‌ట్టుకెళ్లిపోతారు. మ‌న సినిమాల్ని అక్క‌డ ఆడ‌నివ్వ‌రా? అంటూ తెలుగు సినీ ప్రేమికులు నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. సినిమాని సినిమాగానే చూడాల‌ని రాజ‌కీయం చేయొద్దని పరిశ్ర‌మ పెద్ద‌లు స‌ల‌హా ఇస్తున్నారు. మ‌రి రెండో రోజు (శుక్ర‌వారం) అక్క‌డ ప‌రిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. దాడులు కొన‌సాగితే మాత్రం బ‌న్నీ సినిమా వ‌సూళ్లపై విప‌రీత‌మైన ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంది.