English | Telugu

అభిమానుల్ని టెన్ష‌న్‌లో పెడుతున్న ప్ర‌భాస్‌

బాహుబ‌లి విడుద‌ల ఎప్పుడు? వెండి తెర‌పై ప్ర‌భాస్ విశ్వ‌రూపాన్ని మ‌ళ్లీ చూసేదెప్పుడు? ఇంకెంత కాలం బాహుబ‌లిని చెక్కుతారు? ప్ర‌భాస్ అభిమానుల ముందున్న ప్ర‌శ్న‌లు ఇవే. ఏప్రిల్ లో వ‌స్తుంద‌నుకొన్న బాహుబ‌లి ఆ త‌ర‌వాత మేకు వాయిదా ప‌డింది. తర‌వాత జూన్ అన్నారు. ఇప్పుడు జూన్‌లోనూ బాహుబ‌లి రావ‌డం క‌ష్ట‌మేన‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఈ ఆల‌స్యాన్ని త‌ట్టుకోలేక‌పోతున్నారు. విజువ‌ల్ ఎఫెక్ట్స్‌కి సంబంధించిన ప‌నులు ఇంకా ఓ కొలిక్కి రాలేద‌ని 50 శాతం సినిమాకి ఇంకా విజువ‌ల్ ఎఫెక్ట్స్ పూర్త‌వ‌లేద‌ని తెలుస్తోంది. ఈనేప‌థ్యంలో ఈ సినిమా పూర్తికావ‌డానికి ఇంకా రెండు నెల‌ల స‌మ‌యం ప‌డుతుంద‌ట‌. బాహుబ‌లి రిలీజ్ డేట్ ఇదీ అని క‌చ్చితంగా ఒక‌టి చెప్పొచ్చుగా అనేది ప్ర‌భాస్ అభిమానుల మాట‌. అస‌లే ఇప్ప‌టికే ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. ఆల‌స్యం చేస్తే.. సినిమాపై అది ప్ర‌తికూల ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే రెండేళ్ల పాటు ప్ర‌భాస్ అభిమానులు నీరీక్ష‌ణ‌లో ప‌డిపోయారు. ఇక ఆల‌స్యం చేయ‌లేమంటున్నారు ఫ్యాన్స్‌. అయితే ఈ సినిమా విడుద‌ల ఎప్పుడ‌నేది ప్ర‌భాస్ చేతుల్లోనూ లేదు. అది రాజ‌మౌళి, విజుల‌వ్ ఎఫెక్ట్స్ నిపుణులూ చూసుకోవాల్సిన విష‌యం. రాజ‌మౌళి మాత్రం ఈ సినిమా విడుద‌ల విష‌యంలో ఏమాత్రం కంగారు ప‌డ‌డం లేదు. అస‌లే భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన సినిమా. రిలీజ్ డేట్ కూడా ప‌క్కాగానే ఉండాలి అనుకొంటున్నారాయ‌న‌. అందుకే ఆల‌స్య‌మైనా.. ఓపిగ్గా ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నారు. మ‌రి ఆ చెక్కుడు కార్య‌క్ర‌మం ఎప్పుడు పూర్త‌వుతుందో రాజ‌మౌళినే చెప్పాలి.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.

రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.