English | Telugu
నిర్మాతలతో హీరోయిన్ల చెలగాటం
Updated : Dec 16, 2011
నిర్మాతలతో హీరోయిన్ల చెలగాటం ఈ మధ్య బాగా ఎక్కువైంది. మొన్నామధ్య జెనీలియా "ఆరెంజ్" సినిమా విషయంలో తనకు అనుకున్న మొత్తం కంటే మరో పదిలక్షలిస్తే గానీ షుటింగ్ కు రానని మొండికేసిందని మనం విన్నాం. ప్రస్తుతం లేటెస్ట్ గా సిద్ధార్థ హీరోగా, నందినీ రెడ్డి దర్శకత్వంలో, నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న చిత్రంలో సమంత హీరోయిన్ గా నటిస్తూంది. కానీ డేట్లెప్పుడిస్తావని అడిగితే సమాధానం చెప్పట్లేదట.
అలాగే రామ్ హీరోగా, కరుణాకరన్ దర్శకత్వంలో, స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్న "ఎందుకంటే ప్రేమంట" చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా కూడా షూటింగుకు సమయానికి రాకుండా నానా బాధలూ పెడుతూందట. కోట్లకు కోట్లు వారికి పారితోషికాలిచ్చిన నిర్మాతలను ఇలా ఏడిపించటం ఈ వర్థమాన నటిమణులకు భావ్యం కాదు. దీనికి కారణాలేమైనా నిర్మాతల మండలి ఇలాంటి వారిపై సరైన చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఇంకెవరూ ఇలాంటి పనులు చేయకుండా ఉంటారు.