English | Telugu

నాగార్జున "రాజన్న" కథ ఇదే

నాగార్జున"రాజన్న" కథ ఇదేనని ఆయనే స్వయంగా తెలుగువన్ కి తెలియజేశారు. వివరాల్లోకి వెళితే తెలంగాణాలోని నేలకొండపల్లి అనే గ్రామంలో మల్లమ్మ ( ఏన్నీ) అనే పాపను ఆ గ్రామ ప్రజలు ప్రాణంలా చూసుకుంటారు. ఎందుకంటే ఆ పాప బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడి దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తన స్వగ్రామానికి వస్తే, అక్కడ ఇంకా స్వాతంత్ర్యం రాకపోగా, రజాకార్లు, దొరలు ప్రజలను ఏ విధంగా హింసిస్తున్నారో గమనించి, వారిలో తిరుగుబాటు వచ్చేలా చేస్తాడు.

ఆ ప్రయత్నంలో భాగంగా తన ప్రాణాలను పోగొట్టుకున్న యోధుడు "రాజన్న" కూతురే ఈ మల్లమ్మ. "రాజన్న" కూతురే మల్లమ్మ అని తెలిస్తే దొరలు చంపేస్తారని ఆ విషయం ఎవరికీ తెలియకుండా మల్లమ్మను పెంచుతూంటారు. ఆ తర్వాత మల్లమ్మ ఏం చేసిందీ, "రాజన్న" కూతురని ఎలా అనిపించుకుందీ అన్నది మిగిలిన కథ. ఈ నాగార్జున "రాజన్న" చిత్రం డిసెంబర్ 22 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతూంది.