English | Telugu

ఓటీటీలోకి మంచి మిడిల్ క్లాస్ మూవీ!

చైతన్య రావు, భూమి శెట్టి జంటగా కుమారస్వామి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'షరతులు వర్తిస్తాయి'. ఈ ఏడాది మార్చి 15న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం పరవాలేదు అనిపించుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో అలరించడానికి సిద్ధమైంది.

'షరతులు వర్తిస్తాయి' మూవీ రైట్స్ ని ఆహా దక్కించుకుంది. "మంచి మిడిల్ క్లాస్ మూవీ చూడాలని ఉందా? అయితే షరతులు వర్తిస్తాయి" అంటూ తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ ని ప్రకటించింది ఆహా. మే 18 నుంచి ఈ చిత్రం ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలోకి వస్తున్న ఈ మూవీ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

'షరతులు వర్తిస్తాయి' మూవీ రివ్యూ