English | Telugu
తాప్సీ ఇప్పుడు గోల్డెన్ లెగ్?
Updated : Jun 11, 2015
ఛాన్స్ ఇస్తేనే కదా ప్రూవ్ చేసుకునేది అని గతంలో గొడవకు దిగిన తాప్సీ.....నిజంగానే ప్రూవ్ చేసుకుంది. కాంచన సీక్వెల్ గంగలో చెలరేగిపోయింది. అమ్మడిలో అందాలని మాత్రమే చూసేవాళ్లకి నటనలో తాను తక్కువేం కాదని ప్రూవ్ చేసుకుంది. దీంతో తాప్సీ కెరీర్ క్లోజ్ అన్న వాళ్ల నోళ్లు క్లోజ్ అయ్యాయి.
ఒకప్పుడు హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తే చాలనుకున్న పిల్ల...లేటెస్ట్ గా లేడీ ఓరియెంటెడ్ మూవీలో ఛాన్స్ దక్కించుకుంది. మైనా పేరుతో తెరకెక్కనున్న చిత్రంలో తాప్సీ హీరోయిన్ గా ఫిక్సైందట. హీరో ఎవరన్నది ఇంకా క్లారిటీ లేదు. దీంతో ఎవరైనా హీరోని వెతుక్కుని హీరోయిన్ ని ఫైనల్ చేస్తారు. కానీ ఇక్కడ ముందే హీరోయిన్ గా తాప్సీ ఫైనలైందంటే అమ్మడికి క్రేజ్ పెరిగిందనేగా అని డిస్కస్ చేసుకుంటున్నారు. మొత్తానికి తెల్లపిల్ల ఐరెన్ లెగ్ నుంచి గోల్డెన్ లెగ్ గా మారిందన్నమాట. మరి ఈ ఊపు ఎన్నాళ్లు కొనసాగిస్తుందో చూద్దాం.