English | Telugu
నితిన్ - పూరి మధ్య క్లాష్
Updated : Jun 11, 2015
చిత్రసీమ పేరుకు తగ్గట్టే మహా విచిత్రమైంది. ఏ కాంబినేషన్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో, ఏ సినిమా ఎప్పుడు, ఎందుకోసం మధ్యలో ఆగిపోతుందో చెప్పలేం. ఇప్పుడు నితిన్ - పూరి జగన్నాథ్ కాంబో పరిస్థితీ అంతే. హార్ట్ ఎటాక్ సినిమా ఫ్లాప్ అయినా.. ఈ కాంబినేషన్ మళ్లీ కలుస్తుందని ప్రచారం జరిగింది.
పూరి, నితిన్ కూడా 'ఓకే చేసేద్దాం' అనుకొన్నారు. ఈనెల 15నుంచి సినిమా మొదలెట్టాలని ఫిక్స్ అయ్యారు. కానీ అంతలో ఏమైందో... ఈ సినిమా ఆగిపోయింది. ఈ విషయాన్ని అటు పూరి, ఇటు నితిన్ కూడా ధృవీకరించారు. కారణాలు మాత్రం చెప్పడం లేదు. అయితే.. నితిన్ వ్యవహారం నచ్చక పూరి, పూరి చెప్పిన కథ సంతృప్తినివ్వక నితిన్ ఇద్దరూ టాటా చెప్పేసుకొన్నారని టాక్.
నితిన్ మితిమీరిన జోక్యం.. పూరిని చికాకు తెప్పించిందని వికినిడి. కథలో, ఇతరత్రా వ్యవహారాల్లో నితిన్ విపరీతంగా జోక్యం చేసుకొంటున్నాడని, అది నచ్చక పూరి... పక్కకు వెళ్లిపోయాడని తెలుస్తోంది. కథ బాగానే ఉన్నా.. ట్రీట్‌మెంట్ సరిగా లేదన్న నెపంతో నితిన్ కూడా.. ఈసినిమా వద్దనుకొన్నాడట. దాంతో.. ఇద్దరూ సినిమా మొదలెట్టక ముందే 'తూచ్' చెప్పేసుకొన్నారు. అదీ సంగతి. పోనీలెండి... సగం సినిమా అయ్యాక ఈ క్లాష్ వస్తే.. కోట్లకు కోట్లు నష్టం వచ్చేది. ముందే.. బయటపడ్డారు. అదీ ఒక రకంగా మంచిదే.