English | Telugu

సినిమాలు నాకు ముఖ్యం కాదంటున్న శ్రీలీల 

ఒక పాత సినిమాలో నట విరాట్ రావు గోపాలరావు డైలాగ్ ఒకటి ఉంటుంది. ఒకొక్కలకి ఒక్కో సీజన్ అని.. ఇప్పుడు ఆ డైలాగ్ కి న్యాయం చేస్తున్న నటి శ్రీలీల.. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో శ్రీలీల సీజన్ నడుస్తుంది. కానీ ఈ సీజన్ నాకు ముఖ్యం కాదు నా గోల్ వేరే ఉంది అనే ఒక సంచలన స్పీచ్ తో శ్రీలీల టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.

శ్రీలీల తాజాగా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు నా అసలు లక్ష్యం డాక్టర్ అవ్వడం.ఎలాగైనా సరే ఎంబిబిఎస్ పూర్తి చేసి డాక్టర్ ని అవుతాను అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చేస్తున్న పని మాత్రమే కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలని కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుకోవాలని చెప్పింది. మరి ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వారైతే ఇక్కడ లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఇంకో రంగంలో కూడా తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించేలా నైపుణ్యాన్ని సంపాదించుకోవాలని కూడా చెప్పింది. అలాగే ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ప్రతి ఆడపిల్ల తన శక్తీ మేరకు రాణించాలని కూడా చెప్పింది. ప్రస్తుతం శ్రీలీల చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

శ్రీలీల నటించిన తాజా మూవీ ఆదికేశవ ఈ నెల 24 న విడుదలకి సిద్ధం అవుతుండగా మహేష్ తో చేసిన గుంటూరుకారం వచ్చే సంక్రాంతికి విడుదల అవ్వబోతుంది. ఇంకొన్ని భారీ సినిమాలు కూడా సెట్స్ మీద ఉన్నాయి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.