English | Telugu

నెంబర్ వన్ తార నయనతార


సర్వేంద్రియానాం నయనం ప్రధానం...
సర్వతారానాం నయన తార ప్రముఖం...

ఇంద్రియాలలో నయనాలు ప్రధానం అయినట్లే, ఎంతమంది తారలు వచ్చిన ప్రథమ స్థానం నయనతారదే అని నిరూపణ అయ్యింది. సినీ పరిశ్రమకు వచ్చి పదేళ్లు అయినా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది నయన తార.


2005 లో సౌత్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన నయనతార తమిళ, తెలుగు, కన్నడ మలయాళ చిత్రసీమలన్నింటిలోనూ మేటి నటి అనుపించుకుంది. చంద్రముఖి, గజిని, వల్లభన్, లక్ష్మీ, శ్రీరామరాజ్యం, కృష్ణం వందే జగద్గురుం ఇలా అనేక వేరియేషన్స్ వున్న సినిమాల్లో నటించింది. రజనీకాంత్ సహా దక్షిణాది సూపర్ స్టార్ లందరితో కలిసి పనిచేసింది. దశాబ్ద కాలంగా కెరీర్, పర్సనల్ లైఫ్ లో ఎన్నో ఒడిదుడికులు ఎదురుకుంటూ తన స్థానాన్ని కాపాడుకుంటూ వస్తోంది నయనతార.


నటనకు కొంత కాలం దూరం అయినా ఆమెకు అవకాశాలు, ఆదరణ, పారితోషికం ఏమాత్రం తగ్గలేదు. తెలుగులో అనామిక, తమిళంలో రాజారాణి, ఆరంభం చిత్రాలు మరలా నటిగా ఆమె స్థానం సుస్థిరం అయ్యేలా చేశాయి. ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న తార నయన తార. కాజల్, హన్సిక, సమంత ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు. కొత్త హీరోయిన్ల నుంచి గట్టి పోటీ నెలకొన్నప్పటికీ, దాదాపు రెండు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటూ నేటీకీ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది నయనతార.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.