English | Telugu

గప్ చుప్ గా ధనుష్ బర్త్‌డే


తమిళ హీరో ధనుష్‌ 31వ పుట్టినరోజును చాలా సింపుల్ గా జరుపుకున్నారని తెలుస్తోంది. జూలై 28న ఆయన పుట్టినరోజును కుటుంబసభ్యులు, మిత్రుల మధ్య జరుపుకున్నట్లు సమాచారం. ముంబాయిలో 'షమితాబ్' సినిమా షూటింగ్‌లో బిజీగా వున్న ధనుష్ పుట్టినరోజును కుటుంబసభ్యులతో జరుపుకునేందుకు చెన్నై వచ్చారు. ఈ లోపు ధనుష్ భార్య ఐశ్వర్య ఆయన కోసం సర్‌ప్రైజ్ పార్టీ ఏర్పాటు చేశారట. ఈ పార్టీలో ధనుష్ కుటుంబ సభ్యులతో పాటు తమిళ సినీ పరిశ్రమకు చెందిన శింబు, శ్రియా, అమలాపాల్ తదితరులు కూడా హాజరైనట్లు తెలుస్తోంది. హీరో విజయ్ సహా పలువు సినీ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.


ఇటీవలే విడుదలైన తమిళ చిత్రం 'విఐపి' భారీ కలెక్షన్లు రాబడుతోంది. ధనుష్ కోలీవుడ్ తో పాటు బాలీవుడ్ అవకాశాలు చేజిక్కుచ్చుకుని సక్సెఫుల్ సాగిపోతున్నారు. దీంతో ఈ ఏడాది ఆయనకు చాలా ప్రత్యేకమైందని చెప్పాలి.



ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.