English | Telugu

ఔను.. మ‌హేష్ కి 'నో' చెప్పా!

మ‌హేష్.. మ‌హేష్‌... అంటూ క‌థానాయిక‌లు మొత్తం ఆయ‌న జ‌పం చేస్తుంటారు. మ‌హేష్ సినిమాలో క‌థానాయిక‌గా అవ‌కాశం ఇస్తానంటే... చేతిలో ఉన్న సినిమాల్నీ వ‌దిలేసుకోవ‌డానికి కూడా సిద్ధ‌మే. అలాంటిది మ‌హేష్ బాబు సినిమాలో న‌టించే అవ‌కాశం ఇస్తాన‌న్నా నో చెప్పింది. ఆ క‌థానాయిక ఎవ‌రో కాదు. సోనాక్షిసిన్హా. బాలీవుడ్‌లో నెంబ‌ర్ వ‌న్ పొజీష‌న్‌కోసం పోరాడుతున్న క‌థానాయిక సోనాక్షి. గ‌తేడాది మ‌హేష్ ప‌క్క‌న క‌థానాయిక‌గా న‌టిస్తావా?? అని అడిగితే ''నో'' చెప్పేసింది. ఈ విష‌యాన్ని సోనాక్షి సిన్హా ధృవీక‌రించింది కూడా. ''నాకు సౌత్ నుంచి అవ‌కాశాలు వ‌స్తున్నాయి. తెలుగులో కూడా న‌టించ‌మ‌న్నారు. మ‌హేష్ బాబు సినిమాలో క‌థానాయిక‌గా ఛాన్స్ ఇస్తాన‌న్నారు. కానీ... అప్ప‌ట్లో నాకు కాల్షీట్లు అందుబాటులో లేవు. అందుకే ఆ సినిమా వ‌దులుకొన్నా. భ‌విష్య‌త్తులో ఇలాంటి ఛాన్స్ వ‌స్తే వ‌దులుకోను'' అంటోంది సోనాక్షి. ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్ లింగాలో జోడీ క‌ట్టింది ఈ ముద్దుగుమ్మ‌. ఫ్యూచ‌ర్‌లో తెలుగు క‌థానాయ‌క‌ల ప‌క్క‌న మెరిసే ఛాన్సుంద‌న్న‌మాట‌.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.