English | Telugu

ఎంతైనా ర‌జ‌నీ గొప్పోడే!

సినిమా వాళ్లంపై పైపై మెరుగులు, ప్లాస్టిక్ న‌వ్వులు! త‌మ లోపాల‌నే కాదు, క‌నీసం వ‌యసునీ బ‌య‌ట‌కు చెప్పుకోరు. అర‌వై ఏళ్లొచ్చినా ఇంకా అందంగా క‌నిపించాల‌న్న తాప‌త్ర‌యం. కానీ ర‌జ‌నీకాంత్ అలా కాదు. తానేమిటో.. అలానే క‌నిపించాల‌నుకొంటారు. ఆ సొబ‌గుల‌న్నీ తెర‌పైనే. ''అర‌వై ఏళ్లొచ్చాక‌ క‌థానాయిక‌ల‌తో డ్యూయెట్లు పాడ‌డం ఓ పెద్ద శిక్ష‌..'' అని బాహాటంగా చెప్ప‌గ‌లిగారంటే.. ర‌జ‌నీ సింప్లిసిటీకి అంత‌కంటే నిద‌ర్శ‌నం మ‌రేముంటుంది?? ''న‌న్ను అందంగా చూపించ‌డానికి టీమ్ చాలా క‌ష్ట‌ప‌డింది..'' అంటూ త‌న‌పైనే తాను సెటైర్ వేసుకోవ‌డం మాట‌లు కాదు. కేవ‌లం ర‌జ‌నీకాంత్‌కి మాత్ర‌మే అది సాధ్య‌మైంది. హుద్ హుద్ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మేము సైతం కార్య‌క్ర‌మానికి ర‌జ‌నీకాంత్ వ‌స్తాన‌న్నారు. కానీ రాలేదు. ఈ విష‌యంలో ఆయ‌న్నెవ‌ర‌కూ నిందించ‌క్క‌ర్లెద్దు. ''ఎందుకు రాలేదు..'' అని ప్ర‌శ్నించే అధికారం ఎవ్వ‌రికీ లేదు. ఆ సంగ‌తి కూడా అంతా మ‌ర్చిపోయిన త‌రుణంలో ''నేను ఆ కార్య‌క్ర‌మానికి రాలేక‌పోయాను.. న‌న్ను తెలుగు ప్ర‌జ‌లు క్ష‌మించాలి'' అని చేతిలెత్తి న‌మ‌స్క‌రించిన సంస్కారం కేవ‌లం ర‌జ‌నీకే చెల్లు! త్వ‌ర‌లోనే ర‌జ‌నీకాంత్ త‌న విరాళాన్ని ప్ర‌క‌టిస్తాన‌ని కూడా మాటిచ్చారు. లింగ ఆడియో విజ‌యోత్స‌వ వేడుక‌లో మ‌రోసారి ఆయ‌న రాజ‌మౌళికి కీర్తించారు. భార‌త‌దేశంలోనే గొప్ప ద‌ర్శ‌కుడు అవుతార‌ని కితాబిచ్చారు. అవ‌కాశం ఇస్తే, త‌న ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌డానికి సిద్ధంగా ఉన్నాన‌ని త‌లుపులు తెరిచారు. ర‌జ‌నీ అంత స్థాయి ఉన్న హీరో.. ''నేను మీ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించాల‌నిఎదురుచూస్తున్నా..'' అన్నాడంటే విశేష‌మే. మొత్తానికి ర‌జ‌నీ మ‌రోసారి త‌న సింప్లిసిటీతో అద‌ర‌గొట్టాడు. తానెందుకు ప్ర‌త్యేక‌మో చాటి చెప్పాడు. హ్యాట్సాప్ ర‌జ‌నీ..

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.