English | Telugu

దీపిక తెగింపు-సోనాక్షి ఫైర్!

ఏం మాట్లాడుతున్నావో అర్ధమవుతోందా? వాడే పదాలకు అర్థం తెలుసుకుని మాట్లాడితే మంచిదని బొద్దుగుమ్మ సోనాక్షి సిన్హా ఫైరైపోతోంది. ఇంతకీ ఎవరిమీద? ఎందుకు? అంటారా‍‍!

పెళ్లికి ముందు శృంగారానుభవం, వివాహేతర సంబంధం నా ఇష్టం అంటూ పొడుగుకాళ్లసుందరి 'మై ఛాయిస్' పేరిట వీడియో విడుదలచేసిన సంగతి తెలిసిందే. అక్కడితో ఆగకుండా అబ్బాయి కాకుంటే అమ్మాయితో సెక్స్ చేస్తా....మీకేంటి బాధ, అడగడానికి మీరెవరు? అంటూ దీపిక రెచ్చిపోయింది. ఓ వారంరోజులుగా నెట్లో బీభత్సమైన హడావుడి చేసిందీ వీడియో. ఇది చూసిన సోనాక్షి సిన్హా ఒంటికాలిమీద లేచింది. విమెన్ ఎంపవర్ మెంట్ అంటే మనం ఏం బట్టలు వేసుకున్నాం, ఎవరితో సెక్స్ చేస్తాం అనేది కాదు....మహిళలు ధృడంగా తయారవడం, ఉద్యోగవకాశాలు మెరుగుపర్చుకోవడం అని క్లాస్ ఇచ్చింది. దీంతో బీటౌన్ జనాలంతా సోనాక్షి అదరగొట్టావ్ అంటూనే కాస్త నేర్చుకోమ్మా దీపికమ్మా అని సలహాఇస్తున్నారు. అయినా స్టార్ డమ్ ఉంది కదా ఏం చేసినా చెల్లుతుంది, ఏం మాట్లాడినా చెల్లుతుందని ఫీలైతే...ఇలా బుక్కవడం ఖాయం అంటున్నారంతా.

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.