English | Telugu

తెలుగు అమ్మాయిని అని నిరూపించుకున్నశోభిత ధూళిపాళ్ల..అక్కినేని ఫ్యాన్స్ హ్యాపీ  

అక్కినేని నాగ చైతన్య(naga chaitanya)కి ఇటీవలే ఒకప్పటి మిస్ ఇండియా రన్నరప్, ప్రముఖ సినీ నటి అయినటువంటి శోభిత ధూళిపాళ్ల(sobhita dhulipala)తో ఎంగేజ్ మెంట్ అయిన విషయం తెలిసిందే. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే జరిగిన ఈ వేడుకులకి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో కూడా నిలిచాయి.దీంతో అక్కినేని ఫ్యాన్స్ తో పాటు నెటిజన్స్ కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ కామెంట్స్ కూడా చేసారు.

చైతు తో జరిగిన ఎంగేజ్ మెంట్ పై రీసెంట్ గా శోభిత ధూళిపాళ్ళ కొన్ని ఆసక్తి కర వ్యాఖ్యలు చేసింది.ఆ వేడుకను గ్రాండ్ గా చేసుకోవాలని ముందుగా ప్లాన్ లాంటిదేమీ చేసుకోలేదు. ఇలా జరగాలి అలా జరగాలని కలలు కూడా కనలేదు. జస్ట్ జీవితంలో అతి ముఖ్యమైన మధుర క్షణాలని ఆస్వాదించడంతో పాటు తెలుగు సంప్రదాయాలకు అనుగుణంగా అలాంటి వేడుకలు జరగాలని కోరుకున్నాను.కాబట్టి ఆ వేడుక నిరాడంబరంగా జరిగిందని అనుకోవడానికి వీలు లేదు.నా వరకు పర్ఫెక్ట్ పద్దతిలో జరిగిందని చెప్పుకొచ్చింది.

ఇప్పుడు ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా శోభిత సింప్లిసిటీ స్వభావాన్ని కూడా మెచ్చుకుంటున్నారు. 2016 లో రామన్ రాఘవ్ అనే హిందీ చిత్రంతో సినీ రంగ ప్రవేశంచేసిన శోభిత తెలుగులో అడవి శేషు(adavi seshu)హీరోగా వచ్చిన గూఢచారి,మేజర్ వంటి చిత్రాల్లో నటనకి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో కనపడింది.ప్రస్తుతం హిందీలోతనే టైటిల్ రోల్ లో లవ్ సితార(love sitara)అనే మూవీ చేయగా,ఈ నెల 27 న జీ 5 లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.