English | Telugu

ప్రముఖ హీరోయిన్ ఊర్మిళ విడాకులకీ కారణం మోసిన్ అక్తర్ మీర్! 

రంగీలాతో ఇండియన్ చిత్ర పరిశ్రమని ఒక ఊపు ఊపిన నటి ఊర్మిళ మండోద్కర్(urmila matondkar)రంగీలా తర్వాత ఊర్మిళ ఎన్ని భారీ హిట్స్ ని అందుకున్నా కూడా ప్రేక్షకులందరు రంగీలా ఊర్మిళ గానే గుర్తుంచుకున్నారంటే ఆ మూవీతో ఊర్మిళ సృష్టించిన ప్రభంజనాన్ని అర్ధం చేసుకోవచ్చు.తెలుగులో కూడా గాయం,అంతం,అనగనగా ఒక రోజు,భారతీయుడు వంటి చిత్రాల్లో చేసి అశేష అభిమానులని సంపాదించుకుంది.

2016 లో కాశ్మీర్ కి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త మోసిన్ అక్తర్ మీర్( Mohsin Akhtar Mir)ని వివాహం చేసుకున్న ఊర్మిళ ఆ తర్వాత సినిమాలని స్వస్తిక్ చెప్పింది. అయితే ఇప్పుడు వీరి వైవాహిక బంధంలో విబేధాలు తలెత్తాయనే కధనాలు బాలీవుడ్ సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. నాలుగు నెలల క్రితమే ఊర్మిళ ముంబై కోర్టులో విడాకులకి అప్లై చేసిందని అంటు నేషనల్ మీడియాలో సైతం వార్తలు ప్రసారం అవుతున్నాయి. విడాకులకు కారణాలు మాత్రం రకరకాలుగా వినిపిస్తున్నా కూడా ఊర్మిళ అభిమానులు ఆమాత్రం అందుకు కారణం మోసిన్ నే అని అంటున్నారు.

చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ని ప్రారంభించిన ఊర్మిళ హిందీ,తెలుగు,తమిళ, మలయాళ భాషల్లో కలిపి సుమారు అరవై సినిమాల దాకా చేసింది. వాటిల్లో ఎక్కువ భాగం హిందీ సినిమాలే. చివరగా 2018 లో ఇర్ఫాన్ ఖాన్ హీరోగా వచ్చిన బ్లాక్ మెయిల్ అనే మూవీలోని ఒక సాంగ్ లో స్పెషల్ అప్పీయరెన్సు లో కనిపించింది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.