English | Telugu

మురుగదాస్ హీరో ఫిక్స్ అయ్యారు!

ఇటీవల మురుగదాస్ ఫామ్‌ను కోల్పోయారు. స్పైడర్ నుంచి ఆయన ట్రాక్ త‌ప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకు గజినీ సీక్వెల్లో అమీర్ ఖాన్ ఛాన్స్ ఇస్తున్నారని వార్తలు వచ్చాయి. అది కూడా బాలీవుడ్ లో. కానీ విషయమేమో తెలియదు గాని తమిళ ఇండస్ట్రీలో వీడియో యాంకర్ గా కెరీర్ ప్రారంభించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట‌రై హీరోగా మారిన శివ కార్తికేయన్‌తో ఓ చిత్రం చేయ‌నున్నారు. శివ‌కార్తికేయ‌న్ కెరీర్ ప్రారంభంలో హీరోల ఫ్రెండ్ పాత్రలో కనిపించేవారు. తర్వాత హీరోగా టర్న్ తీసుకున్నారు. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం ఆయ‌న‌కు రాలేదు. వరుసగా సినిమాలు చేసుకుంటున్నారు. త‌న‌దైన ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కథలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకులకు వినోదంగా అందిస్తున్నారు. పవర్ఫుల్ మాస్ క‌థ‌ల జోలికి పోకుండా కంటెంట్ బేస్డ్ గా నడిచే స్టోరీలను ఎంపిక చేసుకుంటున్నారు. మినిమం హీరో రేంజ్ హీరోగా సత్తా చాటారు.

ప్రిన్స్ మూవీతో గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆశించిన సాయి సక్సెస్ను అందుకోలేదు. ఆయన లిస్టులో అయ్య‌ల‌న్, మావీర‌న్ సినిమాలు ఉన్నాయి. ఈ రెండు షూటింగ్ దశలో ఉన్నాయి. నిర్మాతగా కూడా శివ కార్తికేయన్ ఐదు సినిమాలు నిర్మించారు. హీరోగా నిర్మాతగా దూసుకుపోతున్నారు. తెలుగులో హీరో నానికి ఆయ‌న‌కు చాలా ద‌గ్గ‌రి పోలిక‌లు ఉన్నాయి. ఇద్ద‌రు ఒకే త‌ర‌హాలో కెరీర్ సాగిస్తున్నారు. ప్ర‌స్తుతం శివ‌కార్తికేయ‌న్ మురుగ‌దాస్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ చేయబోతున్నారు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలకు భిన్నంగా ఈ మూవీ ఉండబోతోంది. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సీరియస్గా ఈ సినిమా సాగనుంది. శివ కార్తికేయన్ మార్కెట్కి మించిన బడ్జెట్ను పెడుతున్నట్టు తెలుస్తోంది. సౌత్ ఇండియాలో స్టార్ హీరోలు అందరూ పాన్ ఇండియా కథలపై దృష్టి పెట్టారు. ఇండియా మొత్తంగా మార్కెట్ ను పెంచుకునే పనిలో పాల్గొన్నారు. ఆ దిశగా ఇప్పుడు శివ కార్తికేయన్ అడుగులు వేస్తున్నారు. ఈ సినిమాని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉందని కోలీవుడ్లో టాక్ వినిపిస్తోంది.