English | Telugu

నిత్యామీనన్ క్యూట్ లుక్స్... స‌మ్ ఫ్రేషనెస్!

నిత్యామీనన్.... ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మలయాలకుట్టిగా పరిచయమైన ఈమె ఎక్స్పోజింగ్‌కు దూరంగా ఉంటుంది. క‌థ‌, త‌న పాత్ర‌ల‌కు ప్రాధాన్యం ఉండే పాత్రల‌ను మాత్ర‌మే ఎంచుకుంటుంది. బాలన‌టిగా ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఈమె తెలుగులో అలా మొదలైంది, ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, జబర్దస్త్, ఒక్కడినే ,కాంచన 2, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఇంకొకడు, ఒక్క అమ్మాయి తప్ప, 100 డేస్ ఆఫ్ లవ్, జనతా గ్యారేజ్, అ, గీతా గోవిందం, ఎన్టీఆర్ కథానాయకుడు, నిన్నిలా నిన్నిలా, సైకో, స్కైలాబ్, తిరువంటి పలు చిత్రాల్లో నటించింది. ఈమె మొదటి చిత్రం అలా మొదలైంది. ఆ తర్వాత ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే చిత్రాలతో తన సత్తా చాటింది. ఈ మధ్యకాలంలో కొత్త హీరోయిన్ల ఎంట్రీ తో పాటు వారు గ్లామర్కి సై అంటున్న నేపథ్యంలో నిత్యామీనన్కు అవకాశాలు తగ్గాయి.

అయితే ఆమె నిరుత్సాహపడకుండా తనకు సూటయ్యే పాత్ర మాత్రమే చేస్తూ వస్తుంది. తాజాగా తన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అందాల ఆరబోతకు దూరంగా క్యూట్ గా కనిపిస్తోంది. స‌మ్ ఫ్రేషనెస్ అనే క్యాప్షన్ ఇచ్చింది. దానికి తోడు లెమన్ సింబల్ ను జ‌త చేసింది. ఇది చూసి నెటిజ‌న్లు సూపర్ క్యూట్ శోభన అంటూ కామెంట్స్ పెడుతున్నారు. నిత్యమీనన్ గత ఏడాది ధనుష్‌తో తిరు అనే సినిమాలో చేసింది. ఈ సినిమాలో నిత్యమీనన్ శోభన అనే క్యారెక్టర్ పోషించింది. ధనుష్ కు ఫ్రెండ్ గా మెప్పించింది. ఆ సినిమా తెలుగు తమిళ్ లో ఎంతో హిట్ట‌యింది. దాంతో అందరూ ఆమెను శోభనా అని కామెంట్ చేస్తున్నారు.