English | Telugu

అల్లు అర్జున్, సిద్ధార్థల పూర్ కెరీర్ గ్రాఫ్

అల్లు అర్జున్, సిద్ధార్థల పూర్ కెరీర్ గ్రాఫ్ ఒకసారి గమనిద్దాం. అల్లు అర్జున్, సిద్ధార్థ ఈ ఇద్దరు యువ హీరోలూ 2003 లోనే తెలుగు సినీరంగ ప్రవేశం చేశారు. ఇద్దరూ ఇంచు మించు సమాన సంఖ్యలోనే తెలుగు సినిమాల్లో నటించారు. అలాగే ఇద్దరూ కూడా సరైన విజయం కోసం నాలుగైదు యేళ్ళుగా తపిస్తూ ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ కి 2007 లో వచ్చిన "దేశముదురు" తర్వాత ఆ రేంజ్ హిట్ మళ్ళీ ఇంతవరకూ రాలేదు. అప్పటి నుండీ అల్లు అర్జున్ హీరోగా నటించిన "పరుగు, ఆర్య-2, వరుడు, వేదం, బద్రీనాథ్" సినిమాలు విడుదలైనా అతని కరువు తీరే హిట్ ఇంతవరకూ రాలేదు.

అలాగే సిద్ధార్థకు 2006 లో వచ్చిన "బొమ్మరిల్లు" సినిమా తర్వాత ఇప్పటి వరకూ ఆ రేంజ్ హిట్‍ లేదు. అప్పటి నుండీ సిద్ధార్థ హీరోగా నటించిన "ఆట, కొంచెం ఇష్టం - కొంచెం కష్టం, ఓయ్, స్ట్రైకర్ (హిందీ), బావ, అనగనగా ఓ ధీరుడు, 180 వంటి సినిమాలు విడుదలైనా వీటిలో ఏ ఒక్కటీ కూడూ గుడ్డా పెట్టే సినిమా, అంటే హిట్ సినిమా లేకపోవటం విచారకరం. వీళ్ళిద్దరి సినిమా కెరీర్ గ్రాఫ్ మీకోసం అందిస్తున్నాం.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.