English | Telugu

మహేష్ తో శృతి రెండుసార్లు రొమాన్స్

"గబ్బర్ సింగ్" చిత్రంతో లక్కీ హీరోయిన్ గా మారిన శృతిహాసన్ ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాష చిత్రాలతో బిజీగా ఉంది. శృతిహాసన్ ఇటీవలే మణిరత్నం సినిమాలో మహేష్ సరసన హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే తాజాగా మరో భారీ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుంది.

కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో మహేష్ సరసన హీరోయిన్ గా శృతి హాసన్ ను ఖరారు చేసారు. ఈ ప్రాజెక్టు త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నాడు.

శృతి ప్రస్తుతం హిందీలో "గబ్బర్", "వెల్ కం బ్యాక్" చిత్రాల్లో నటిస్తుంది. అలాగే తమిళంలో విశాల్ తో కలిసి "పూజై" చిత్రంలో నటిస్తుంది. అలాగే త్వరలోనే మహేష్ తో నటించబోయే మణిరత్నం, కొరటాల శివ చిత్రాలు సెట్స్ పైకి వెళ్లనున్నాయి. ఇప్పటికే ఈ అమ్మడు నటించిన అన్ని చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ 1హీరోయిన్ గా శృతిహాసన్ కొనసాగుతుంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.