English | Telugu

సూర్యకు ఎలాంటి గాయాలు కాలేదు: అంజాన్

"గజిని", "యముడు" వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ నటుడు సూర్యకి ఇటీవలే "అంజాన్" చిత్ర షూటింగ్ సమయంలో గాయాలయ్యాయని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని "అంజాన్" చిత్ర యూనిట్ ఖరారు చేసింది. "సూర్యకు ఎలాంటి గాయాలు తగలలేదు. ఆయన చాలా క్షేమంగా ఉన్నాడు. ప్రస్తుతం గోవాలో సెల్వా మాస్టర్ నేతృత్వంలో క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నామని" చిత్ర యూనిట్ తెలిపింది. ఇందులో సూర్య సరసన సమంత హీరోయిన్ గా నటిస్తుంది. లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఆడియోను, సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.