English | Telugu

విశాల్ 9 కోట్ల‌కు బుక్క‌య్యాడు

శ‌ర‌త్‌కుమార్ Vs విశాల్... ప్ర‌స్తుతం త‌మిళ న‌డిగ‌ర సంఘం ఎన్నిక‌ల తీరు చూస్తుంటే వీళ్లిద్ద‌రి మ‌ధ్య యుద్ధం న‌డుస్తున్న‌ట్టే ఉంది. ఈ ఎన్నిక‌ల్లో గెలుపుని వ్య‌క్తిగ‌త విజ‌యంగా భావించిన ఈ సినీ న‌టులిద్ద‌రూ తాడో పేడో తేల్చుకోవ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఇరు వ‌ర్గాల మ‌ధ్య అక్క‌డ ఆస‌క్తిక‌ర‌మైన పోరు న‌డుస్తుండ‌డంతో విజ‌యం కోసం ఇటు శ‌ర‌త్‌కుమార్‌, అటు విశాల్ ఇద్ద‌రూ నువ్వా నేనా అంటూ ఢీ కొట్టుకొంటున్నారు. ఒక‌రిపై మ‌రొక‌రు ప‌ర‌స్ప‌న ఆరోప‌ణ‌లు చేసుకోవ‌డానికి కూడా వెనుకంజ వేయ‌డం లేదు.

'తాజాగా.. విశాల్ చేసిన ఆరోప‌ణ‌లు త‌మిళ‌నాట సంచల‌నం సృష్టిస్తున్నాయి. న‌డిగ‌ర సంఘం ప్ర‌స్తుత అధ్య‌క్షుడు శ‌ర‌త్‌కుమార్ గ‌తంలో చాలా అవ‌క‌త‌వ‌క‌లు చేశార‌ని, నిధుల దుర్వినియోగం జ‌రిగింద‌ని, కోట్ల రూపాయ‌ల న‌ష్టం వాటిల్లింద‌ని.. విశాల్ ఆరోప‌ణ‌లు చేశాడు. వీటిపై శ‌ర‌త్ కుమార్ కూడా తీవ్రంగా స్పందించాడు. విశాల్ త‌న ప‌రువుకి న‌ష్టం క‌లిగించేలా మాట్లాడుతున్నాడ‌ని, ప్ర‌జ‌ల స‌మ‌క్షంలో త‌న‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని లేదంటే ప‌రువు న‌ష్టం దావా వేస్తాన‌ని, ఆ రూపంలో విశాల్ త‌న‌కు 9 కోట్ల రూపాయ‌లు చెల్లించాల‌ని హ‌చ్చ‌రిస్తూ. కోర్టు నోటీసులు పంపాడు. మ‌రోవైపు విశాల్‌... తాను ఎవ్వ‌రికీ క్ష‌మాప‌ణ‌లు చెప్పే ప్ర‌శ్నే లేద‌ని భీష్మించుకొని కూర్చున్నాడు.

మ‌రి శ‌ర‌త్ కుమార్ ఎలాంటి స్టెప్పు వేస్తాడో, అందుకు విశాల్ ఎలా జ‌వాబు చెబుతాడో అని.. త‌మిళ‌నాట సినీ లోకం ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .