English | Telugu

ఫ‌టాఫ‌ట్‌.. పూరి

పూరి జ‌గన్నాథ్‌ని చూడండి... గ‌డ్డం పెంచుకొని కాస్త ర‌ఫ్‌గా క‌నిపిస్తాడు.
అత‌ని మాట‌లు వినండి... ఆధునిక‌త‌కు క‌మ‌ర్షియ‌ల్ ట‌చ్ ఇవ్వ‌డం ఏంటో చూపిస్తాడు.
కనిపించింది, వినిపించిందీ కొంతే.. లోప‌లున్న పూరి అలాంటిలాంటోడు కాదు. అంత‌కు ప‌దింతలో, వందింత‌లో. నిజంగా నిజమైన పూరి బ‌య‌ట‌కొస్తే త‌ట్టుకోలేరు!

నిజం.. పూరి ఫ‌టాఫ‌ట్‌లాంటోడు. అత‌ని సినిమాలూ, మాట‌లు, జీవితం అంతా అలానే ఉంటాయ్‌.
క‌థ గురించి నెల‌ల త‌ర‌బ‌డి ఆలోచించి, స్ర్కిప్టుపై సంవ‌త్సరాల త‌ర‌బ‌డి కూర్చుకొని, యేళ్ల‌కు యేళ్లు సినిమా తీయ‌డం అత‌నికి బొత్తిగా న‌చ్చ‌దు. పాయింట్ అనుకొన్న‌మా.. బ్యాంకాక్ వెళ్లి వారంలో రాసుకొచ్చామా, నెల రోజుల్లో తీసేశామా.. అంతే! చాంతాడంత డైలాగులు రాసుకొని, అందులో సెంటిమెంట్ బ‌ల‌వంతంగా ఇరికించి, భారీ ఎమోష‌న్ పండించడం చేత కాదు. ఓ నిజాన్ని వెండి తెర‌పై క‌థ‌గా అల్ల‌డం మాత్ర‌మే త‌న‌కు తెలుసు. హీరో పాత్ర‌లో మాత్ర‌మే ఫాంట‌సీ ఉంటుంది. అత‌ని చుట్టూ ఉన్న ప్ర‌పంచం మాత్రం వాస్త‌విత‌కు కిలో మీట‌రు ద‌గ్గ‌ర‌లో ఉంటుంది. త‌న‌లోని స్పీడు సినిమాలోనూ క‌నిపిస్తుంది. హీరో... హీరోల‌కే హీరోలా క‌నిపిస్తాడు. మాట‌లు బుల్లెట్ల వేగం త‌ల‌పిస్తాయ్‌. చేత‌లు.. ఇక చెప్ప‌క్క‌ర్లెద్దు. ర‌న్ వే పై దూసుకొచ్చే విమానంలా ర‌య్ మంటుంటాయ్‌.

చూస్తుండ‌గానే పూరి పాతిక సినిమాలు తీసేశాడు.
మీరింకా చూస్తామంటే మ‌రో పాతిక అవ‌లీల‌లా ఊదేస్తాడు.
త‌న‌కింకా సినిమాల‌పై ఇదే పిచ్చి ఉంటే.. సెంచ‌రీ చేసినా చేస్తాడు.
ఎందుకంటే త‌ను పూరి.. ఫ‌టాఫ‌ట్ పూరి!

ఒక‌ప్ప‌టి గొప్ప ద‌ర్శ‌కులంతా సినిమా పిచ్చోళ్లే. వాళ్ల‌కు సినిమా త‌ప్ప మ‌రో లోకం లేదు. వ్య‌క్తిగ‌త జీవితాల్ని ప‌ట్టించుకొన్నారా అన్న‌దీ అనుమాన‌మే. కానీ పూరి అలా కాదు. సినిమాకి 12 గంట‌లు, త‌న కోసం మ‌రో 12 గంట‌లూ అన్న‌ట్టుంటుంది పూరి వ్య‌వ‌హారం.త‌న కోసం తాను బ‌త‌క‌డం అంటే ఏమిటో పూరికి బాగా తెలుసు. ఏ ప‌నిలో కిక్కు వ‌స్తుందో ఇంకా బాగా తెలుసు. ఆ కిక్ కోసం ప‌రిత‌పిస్తుంటాడు పూరి.

పుస్త‌కంతో కిక్ వ‌స్తుంద‌నుకొంటే.. ఆ పుస్త‌క‌మే ప్ర‌పంచంగా బ‌తుకుతాడు పూరి.
ప్ర‌పంచ‌మే కిక్ అనుకొంటే... ఓసారి అలా చుట్టొచ్చేస్తాడు పూరి.
త‌న‌కు తానే కిక్ అనుకొంటే... ఒంట‌రిగా ఉంటూ ఆస్వాదిస్తాడు పూరి.
హైద‌రాబాద్‌లోని పూరి జ‌గ‌న్నాథ్ ఆపీసులోకి అడుగుపెట్టండి. ఓ హాలీవుడ్ స్టూడియోలోని ఫ్లోర్ చూసినంత అనుభూతి క‌లుగుతుంది. త‌న టేస్ట్ కి త‌గ్గ‌ట్టు రిచ్‌గా ఆఫీసుని తీర్చిదిద్దుకొన్నాడు పూరి. అంతా కాదంటే.. పొద్ద‌స్త‌మానం సినిమాల్లోనే మ‌మేక‌మై గ‌డిపేస్తుంటాడు.

ప‌డ‌డం, మ‌ళ్లీ లేవ‌డం పూరికి అల‌వాటు. డౌన్‌ఫాల్‌లో ఉన్న‌ప్పుడు, త‌న ఫాలోయింగ్ ఏమిటో త‌న‌కు తెలుసు. మ‌ళ్లీ హిట్ కొట్టిన‌ప్పుడు నిర్మాత‌ల ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో తెలుసు. అందుకే హిట్ట‌యినా, ఫ్లాప్ అయినా సినిమా తీయ‌డంలో ఉన్న కిక్ ఆస్వాదిస్తుంటాడు పూరి. అందుకే సినిమాల మీద సినిమాలు తీసుకొంటూ వెళ్తుంటాడు.
వ‌రుస‌గా హిట్లిచ్చుకొంటూ పోతే పూరిని నిర్మాత‌లు వ‌ద‌ల‌రు.
వ‌రుస‌గా ఫ్లాపులిచ్చినా పూరి సినిమాల్ని వ‌ద‌ల‌డు.
ఎందుకంటే... నేనింతేలో డైలాగ్ గుర్తుంది క‌దా?
హిట్టొచ్చింద‌ని సినిమాలు తీయ‌డం మానేస్తామా, ఫ్లాప్ వ‌స్తే ఆపేస్తామా అన్న‌ట్టు..పూరి స్పీడు ఇలానే కొన‌సాగుతుంది. యాభై దాటి.. వంద వ‌ర‌కూ... త‌ధాస్తు.

(ఈరోజు పూరి జ‌న్మ‌దినం సంద‌ర్భంగా)

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.