English | Telugu

ఫస్ట్ వీక్ సంక్రాంతికి వస్తున్నాం రికార్డు కలెక్షన్స్..వెంకీ ఫ్యాన్స్ సంబరాలు   

విక్టరీ వెంకటేష్(venkatesh)అనిల్ రావిపూడి(Anil Ravipudi)దిల్ రాజు(Dil Raju)కాంబోలో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam).ఈ నెల 14 న విడుదలైన ఈ మూవీ అన్ని ఏ రియాల్లోను పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకుపోతుంది.ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు,ఎంటర్ టైన్మేంట్ ని కోరుకునే ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరధం పడుతున్నారు.ఇక ఈ మూవీ తొలి రోజు నుంచే రికార్డు కలెక్షన్స్ ని సృష్టిస్తున్న విషయం తెలిసిందే.

అందులో భాగంగా ఇప్పుడు వారం రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 203 కోట్ల రూపాయిల గ్రాస్ కలెక్షన్ ని రాబట్టి సరికొత్త హిస్టరీ ని క్రియేట్ చేసింది. మొదటి వారమే 200 కోట్ల క్లబ్ లో చేరడంతో ఎండింగ్ టైంకి ఎంత ఫిగర్ దగ్గర క్లోజ్ అవుతుందనే ఆసక్తి అందరిలో ఉంది.ఆల్రెడీ పాజిటివ్ టాక్ ఉండటం,దగ్గరలో ఇంకో కొత్త మూవీ లేకపోవడం,సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్స్(Sankranthiki vasthunam)మరింతగా పెరిగే అవకాశం ఉందని కూడా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మూడున్నర దశాబ్దాల తన సినీ కెరీర్ లో వెంకీ రెండువందల కోట్ల మార్క్ ని అందుకోవడం ఇదే ఫస్ట్ టైం. గతంలో ఎఫ్ 2 130 కోట్లతో వెంకీ కెరీరి లో హయ్యెస్ట్ కలెక్షన్ సాధించిన మూవీ గా ఉండేది. కాకపోతే అందులో మరో హీరో వరుణ్ తేజ్ కూడా ఉన్న విషయం తెలిసిందే.అలాంటిది ఇప్పుడు సోలో హీరోగా వెంకీ 200 కోట్ల క్లబ్ లో చేరడంతో ఆయన అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.సీనియర్ హీరోల కోటాలో చూసుకుంటే చిరంజీవి(Chiranjeevi)గతంలో సైరా నరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య తో 200 కోట్ల క్లబ్ లో చేరాడు.ఇప్పుడు వెంకీ కూడా చిరు సరసన చేరాడు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .