English | Telugu

రానాతో కలిసి మీడియా ముందుకి సమంత!

నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత (Samantha) సినిమాల్లో వేగం తగ్గిపోయింది. మీడియా ముందుకి కూడా పెద్దగా రావడంలేదు. అయినప్పటికీ ఆమె పేరు తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ఇటీవల సమంత విడాకులకు కేటీఆర్ కారణమంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మీ రాజకీయాల కోసం తన పేరుని లాగొద్దంటూ సోషల్ మీడియా సమంత ఆవేదన వ్యక్తం చేయడం, కొండా సురేఖ క్షమాపణలు చెప్పడం జరిగిపోయాయి. ఈ క్రమంలో ఇప్పుడు సమంత మీడియా ముందుకి వస్తుండటం ఆసక్తికరంగా మారింది.

అలియా భట్ ప్రధాన పాత్ర పోషించిన 'జిగ్రా' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు(సెప్టెంబర్ 8) సాయంత్రం హైదరాబాద్ లోని పార్క్ హయత్ లో జరగనుంది. ఈ ఈవెంట్ కి త్రివిక్రమ్ తో పాటు సమంత, రానా ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. ఇదే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఈవెంట్ లో సమంత ఏం మాట్లాడుతుంది? నాగచైతన్యతో విడాకులు, కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందిస్తుందా? అనే ఆసక్తి నెలకొంది. అలాగే రానా, చైతన్య బావ బామ్మర్దులు అవుతారనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో రానా, సమంత లు మునుపటిలా మాట్లాడుకుంటారా అనే ఆసక్తి కూడా నెలకొంది.